అక్షయ్ 'ఓ మై గాడ్‌ 2' ప్రారంభం

ABN , First Publish Date - 2021-09-04T15:17:13+05:30 IST

2012లో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న హిందీ చిత్రం 'ఓ మై గాడ్‌'. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'ఓ మై గాడ్‌ 2' తెరకెక్కుతోంది.

అక్షయ్ 'ఓ మై గాడ్‌ 2' ప్రారంభం

2012లో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న హిందీ చిత్రం 'ఓ మై గాడ్‌'. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'ఓ మై గాడ్‌ 2' తెరకెక్కుతోంది. పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యామి గౌతమ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ముంబయిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అక్షయ్‌ ఇందులో పోషిస్తున్న కృష్ణుడి పాత్ర కోసం 20 రోజులు కాల్షీట్లను కేటాయించారని సమాచారం. ఈ మూవీకి అమితాయ్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తుండగా, అక్షయ్‌కుమార్‌ - అశ్విన్‌ వర్డే కలిసి నిర్మిస్తుండటం విశేషం. కాగా ఈ మధ్యనే 'బెల్‌బాటమ్' చిత్రంతో వచ్చి ఆకట్టుకున్నాడు అక్షయ్‌.

Updated Date - 2021-09-04T15:17:13+05:30 IST