ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న అక్షయ్ కుమార్.. వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసేందుకు రేసులో ముగ్గురు దర్శకులు..?

ABN , First Publish Date - 2022-01-20T01:18:41+05:30 IST

సినిమా షూటింగ్‌లను శరవేగంగా పూర్తి చేస్తారని అక్షయ్ కుమార్‌కి పేరుంది. ఈ ఏడాది ఆరు ప్రాజెక్టులతో అతడు బిజీగా ఉన్నారు.

ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న అక్షయ్ కుమార్.. వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసేందుకు రేసులో ముగ్గురు దర్శకులు..?

సినిమా షూటింగ్‌లను శరవేగంగా పూర్తి చేస్తారని అక్షయ్ కుమార్‌కి పేరుంది. ఈ ఏడాది ఆరు ప్రాజెక్టులతో అతడు బిజీగా ఉన్నారు. ‘‘రామ్ సేతు’’, ‘‘సెల్ఫీ’’, ‘‘గోర్ఖా’’, ‘‘బడే మియా చోటే మియా’’ వంటి చిత్రాలను చేయనున్నారు.  అక్కీ ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నా సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టు పేరు ‘‘ది ఎండ్’’.  అమెజాన్ ప్రైమ్‌లో 2023 అర్థభాగంలో ఈ సిరీస్ విడుదల కాబోతుంది. అమెజాన్ ప్రైమ్‌తో కలిసి విక్రమ్ మల్హోత్రా ఈ సిరీస్‌ను నిర్మించబోతున్నారు. ఆ ప్రాజెక్టు స్క్రిఫ్ట్, స్క్రీన్ ప్లే సిద్ధం అయిందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ప్రస్తుతం ఆ సిరీస్‌కు సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫ్రీ ఫ్రొడక్షన్ వర్క్ ఏప్రిల్ లోపు పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 


‘‘ ‘ది ఎండ్’ భారత్ లో తెరకెక్కబోయే బిగ్గెస్ట్ వెబ్ సిరీస్. కనివినీ ఎరుగనీ రీతిలో యాక్షన్ సన్నివేశాలు ఈ సిరీస్‌లో ఉంటాయి. స్క్రిఫ్ట్ మీద చాలా కాలంగా టీమ్ పనిచేస్తోంది. సరికొత్త పాయింట్‌తో ఈ సిరీస్ తెరకెక్కబోతోంది. యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. అక్షయ్ కుమార్ ప్రజలను కాపాడటానికి  టైమ్‌కు వ్యతిరేకంగా పోరాడతారు. త్వరలోనే ఈ సిరీస్ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ను షూట్ చేయడానికి ముగ్గురు దర్శకులు రేసులో ఉన్నారు. ‘రామ్ సేతు’ దర్శకుడు అభిషేక్ శర్మ, ‘ఫ్యామిలీ మ్యాన్-2’ దర్శకుడు సుపర్న్ వర్మ, ‘కేసరి’ దర్శకుడు అనురాగ్ సింగ్ పోటీపడుతున్నారు’’ అని ఆ వెబ్ సిరీస్‌తో సంబంధం ఉన్న వ్యక్తి  చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి దర్శకుడిని ఫైనలైజ్ చేస్తారు. ‘ది ఎండ్’ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తారని బీ టౌన్ మీడియా చెబుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో 2023 అర్థభాగం నుంచి ఈ సిరీస్  స్ట్రీమ్ కానుందట. 

Updated Date - 2022-01-20T01:18:41+05:30 IST