Raksha Bandhan vs Laal Singh Chaddha.. ఒకే రోజు రెండు సినిమాల విడుదలపై Akshay Kumar రియాక్షన్..!

ABN , First Publish Date - 2022-06-22T17:38:40+05:30 IST

బాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో Aamir Khan, Akshay Kumar కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే...

Raksha Bandhan vs Laal Singh Chaddha.. ఒకే రోజు రెండు సినిమాల విడుదలపై Akshay Kumar రియాక్షన్..!

బాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో Aamir Khan, Akshay Kumar కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. వారి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే త్వరలో ఈ ఇద్దరూ స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరగబోతోంది. ఆమీర్ నటించిన లాల్ సింగ్ చద్ధా (Laal Singh Chaddha), అక్షయ్ నటించిన రక్షా బంధన్ (Raksha Bandhan) ఒకేరోజు అంటే ఆగస్టు 11న విడుదలకానున్నాయి. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాల మధ్య జరిగే బిగ్‌ఫైట్‌లో ఎవరీ సినిమా సక్సెస్ అవుతుందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.


తాజాగా అక్షయ్ సినిమా ‘రక్షా బంధన్’ ట్రైలర్‌ని మూవీ టీం విడుదల చేసింది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ మాట్లాడుతూ ఈ రెండు సినిమాల క్లాష్ గురించి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అది క్లాష్ కాదు. రెండు మంచి సినిమాలు కలిసి ఒకే రోజు రాబోతున్నాయి. ఇదో అభిమానులకి గొప్ప రోజు. కోవిడ్ కారణంగా చాలా సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు. చాలా మూవీస్‌ విడుదల తేది కోసం ఎదురుచూస్తున్నాయి. అందుకే పలు చిత్రాలు కలిసి విడుదల కావడం సాధారణమే. రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.




కాగా.. తాజాగా విడుదలైన అక్షయ్ ‘రక్షా బంధన్’ ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ని అందుకుంటోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమి పడ్నేకర్ హీరోయిన్‌గా నటించింది. అన్నాచెల్లెళ్ల బంధంపై వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ మూవీ ట్రైలర్‌ని ఇక్కడ చూసేయండి..



Updated Date - 2022-06-22T17:38:40+05:30 IST