బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లోని ఇతర స్టార్ హీరోల కంటే అక్షయ్ కుమార్ దక్షిణాది రీమేక్‌లు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. విక్రమార్కుడు, కాంచన చిత్రాల రీమేక్స్‌లో అక్షయ్ నటించిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు మరో దక్షిణాది రీమేక్‌లో ఈయన నటించబోతున్నట్లు వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ అక్షయ్ నటించబోతున్న దక్షిణాది రీమేక్ మూవీ ఏదో తెలుసా? రాక్షసన్. తమిళంలో రామ్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు పేరుతో రమేశ్ వర్మ తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. తెలుగులో రాక్షసుడు సినిమాను డైరెక్ట్ చేసిన రమేశ్ వర్మనే తెరకెక్కించే అవకాశాలున్నాయని సమాచారం.