అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' ట్రైలర్ రిలీజ్

ABN , First Publish Date - 2021-08-04T16:17:49+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన లేటెస్ట్ మూవీ 'బెల్ బాట‌మ్' తాజాగా మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ మరో భారీ హిట్ అందుకోవడానికి సిద్దమవుతున్నారు. ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో వాణీ క‌పూర్‌, హ్యూమా ఖురేషీ, లారా దత్తా ముఖ్య పాత్రలు పోషించారు.

అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన లేటెస్ట్ మూవీ 'బెల్ బాట‌మ్' తాజాగా మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ మరో భారీ హిట్ అందుకోవడానికి సిద్దమవుతున్నారు. ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో వాణీ క‌పూర్‌, హ్యూమా ఖురేషీ, లారా దత్తా ముఖ్య పాత్రలు పోషించారు. 1984లో ఇండియాలో జ‌రిగిన విమానాల‌ హైజాక్స్ ఘ‌ట‌న‌ల బ్యాక్ డ్రాప్‌లో 'బెల్ బాట‌మ్' కథ సాగ‌నుంద‌ని తాజాగా విడుదలయిన ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో అక్ష‌య్ కుమార్ 'రా' ఏజెంట్ బెల్ బాట‌మ్ గా నటించాడు. ట్రైలర్ మొత్తంలో అక్షయ్ పాత్రే హైలెట్‌గా చూపించారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీ ఆగస్టు 19న భారీ స్థాయిలో థియేటర్లలోకి విడుదల కాబోతోంది. 



Updated Date - 2021-08-04T16:17:49+05:30 IST