‘ఏజెంట్‌‌’ కోసం AKHIL AKKINENI బీస్ట్‌లుక్‌

ABN , First Publish Date - 2021-07-11T20:47:27+05:30 IST

అఖిల్‌ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'ఏజెంట్‌'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్పై థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందబోయే ఈ సినిమా కోసం అఖిల్‌..

‘ఏజెంట్‌‌’ కోసం AKHIL AKKINENI బీస్ట్‌లుక్‌

అఖిల్‌ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'ఏజెంట్‌'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్పై థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందబోయే ఈ సినిమా కోసం అఖిల్‌ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. హెయిర్‌ స్టైల్‌తో పాటు బాడీ లుక్‌ కూడా పూర్తిగా మార్చేశాడు మన అక్కినేని హీరో. ఈ బీస్ట్‌ లుక్‌కి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో బాడీ బిల్డర్‌లా అఖిల్‌ తన ఫిజిక్‌ను మార్చుకుని ఉండటం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లబోతున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. మరోవైపు 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' సినిమాతో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రైటర్‌, డైరెక్టర్‌ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Updated Date - 2021-07-11T20:47:27+05:30 IST