విజయవాడ కనకదర్గమ్మను దర్శించుకున్న బ్యాచ్ లర్

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా.. బన్నీవాసు నిర్మాణంలో,  ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కించిన వెరైటీ ప్రేమకథాచిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. దసరా కానుక గా చిత్రాన్ని రేపు (అక్టోబర్ 15) విడుదల చేయబోతున్నారు.  ఇదివరకు విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్, సింగిల్స్ సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథానాయకుడు అక్కినేని అఖిల్ .. నేడు (గురువారం) విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అఖిల్ కు ఈ సినిమా విజయం అత్యవసరం. అందుకే ఈ నవరాత్రి సందర్భాన్ని పురస్కరించుకున్న అఖిల్ అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. 

‘అఖిల్, హలో, మిస్టర్ మజ్ను’ లాంటి సినిమాలు అఖిల్ కు వరుస పరాజయాల్ని తెచ్చిపెట్టాయి. అందుకే నాలుగో చిత్రమైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు అఖిల్. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో అఖిల్ కు ఈ సినిమాతో తొలి విజయం ఖాయమంటున్నారు. మరి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ పై కనకదుర్గమ్మ కరుణా కటాక్షాలు ఏ స్థాయిలో దక్కుతాయో చూడాలి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.