అక్కినేని అఖిల్.. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కుర్ర హీరో. జయాపజయాల సంగతిని పక్కన పెడితే ఈ యంగ్ హీరో మంచి అవకాశాలనే అందిపుచ్చుకుంటున్నాడు. అఖిల్ టైటిల్ పాత్రలో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఖిల్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తుందట. వివరాల్లోకెళ్తే డైరెక్టర్ శ్రీనువైట్ల ఓ లవ్‌స్టోరిని సిద్ధం చేశాడు. దీన్ని మైత్రీ సంస్థలో చేయడానికి ఆయన సిద్ధమైయ్యాడు. వారు ఈ ప్రాజెక్ట్‌లోకి అఖిల్‌ను తీసుకురావాలనుకుంటున్నారట. అయితే శ్రీనువైట్లతో సినిమా చేయడానికి అఖిల్ ఏ మేరకు ఆసక్తి చూపుతాడో చూడాలంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.