విరాట్ కోహ్లీ గా నటించేందుకు నేను రెడీ : అఖిల్ అక్కినేని

‘మోస్ట్ ఎలిజిబుబ్ బ్యాచ్ లర్’ మూవీతో నాలుగో సారి తన అదృ‌ష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అక్కినేని వారి నటవారసుడు అఖిల్.  ఈ మూవీపై  మంచి బజ్ ఉండడంతో .. దీంతో తొలి హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు అఖిల్. దసరా కానకగా రేపే (శుక్రవారం) సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు అఖిల్. అందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు అఖిల్.

తనకి క్రీడల నేపథ్యంలోని సినిమాల్లో నటించాలని ఉందని, ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన కపిల్ దేవ్ బయోపిక్ ‘83’  గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, అలాంటి బయోపిక్స్ లో నటించడానికి తాను రెడీ అని తెలిపారు అఖిల్. అదేసమయంలో విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తే అందులో హీరోగా నటించడానికి తాను రెడీ అని తెలిపారు. విరాట్ బయోపిక్ తిరుగులేని కథగా నిలబడుతందని అన్నారు అఖిల్. మరి అఖిల్ తో విరాట్ కోహ్లీ బయోపిక్ ఏ నిర్మాత తీస్తారో చూడాలి.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.