అక్కినేని సన్‌తో ‘Godfather’ డైరెక్టర్ ?

ABN , First Publish Date - 2022-05-24T15:24:28+05:30 IST

తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohanraja) ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో ‘గాడ్‌ఫాదర్’ (Godfather) చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్టీట్ అయింది. చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేయాలనుకుంటున్నారు.

అక్కినేని సన్‌తో ‘Godfather’ డైరెక్టర్ ?

తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohanraja) ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో ‘గాడ్‌ఫాదర్’ (Godfather) చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్టీట్ అయింది. చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేయాలనుకుంటున్నారు. గతంలో ఈ దర్శకుడు తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ (Hanuman Junction) అనే చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇది కూడా ‘తెన్ కాశీపట్టణం’ అనే మలయాళ చిత్రానికి రీమేక్ వెర్షన్. మొత్తానికి రీమేక్స్ తీసి హిట్స్ కొట్టడంలో ప్రత్యేక టాలెంట్ కలిగిన ఈ దర్శకుడు..  ‘గాడ్‌ఫాదర్’ తర్వాత అక్కినేని (Akkineni) వారి కాంపౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు టాక్.  


నిజానికి దర్శకుడు మోహన్ రాజా (Mohanraja) నాగార్జున హీరోగా ఓ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు నిన్న మొన్నటివరకూ వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మోహన్ రాజా నెక్స్ట్ మూవీని ఆయనతో కాకుండా.. ఆయన కుమారుడు అఖిల్‌ (Akhil) తో ఓ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. ఇది కూడా ఓ మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేకే అని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే అది ఏ సినిమా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం అఖిల్ సురేంద్ర రెడ్డి (Surenderreddy) దర్శకత్వంలో ‘ఏజెంట్’ (Agent) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. సెప్టెంబర్ లో కానీ, అక్టోబర్ లో కానీ మోహన్ రాజా దర్శకత్వంలోని చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈలోగా ‘గాడ్‌ఫాదర్’ పనులు కూడా పూర్తవుతాయి.  మరి అఖిల్‌తో  మోహన్ రాజా ఏ తరహా చిత్రం తెరకెక్కిస్తాడో చూడాలి. 

Updated Date - 2022-05-24T15:24:28+05:30 IST