New Movie: మహీంద్ర పిక్చర్స్.. ఆకాష్ పూరి క్లాప్

ABN , First Publish Date - 2022-10-07T03:57:40+05:30 IST

మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి, రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి. శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్

New Movie: మహీంద్ర పిక్చర్స్.. ఆకాష్ పూరి క్లాప్

మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి, రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి. శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హైదరాబాద్, సత్యసాయి కల్యాణమండపంలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో ఆకాష్ పూరి.. తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరోహీరోయిన్ల‌పై క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. ‘‘నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు నిర్మాత వి. శ్రీనివాస రావ్. వారికి నా ధన్యవాదాలు. హీరో ఆకాష్ పూరి, నిర్మాత బి. రావు‌ల బ్లెసింగ్స్‌తో హ్యాపీ. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అలాగే లవ్, ఫ్యామిలీకి సంబంధించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి’’ అని అన్నారు దర్శకుడు చిన్న వెంకటేష్.


చిత్ర నిర్మాత వి. శ్రీనివాస రావ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మేము పిలవగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన హీరో ఆకాష్ పూరి, నిర్మాత బి. రావుగార్లకు ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా. దర్శకుడు వెంకటేష్ చెప్పిన కథ నచ్చడంతో.. మహీంద్ర పిక్చర్స్  పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నాను. ప్రేక్షకులందరికి నచ్చేవిధమైన అన్ని అంశాలతో వస్తున్న ఈ సినిమా మా బ్యానర్‌కు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. ఈ నెల 17 నుండి చీరాలలో మొదటి షెడ్యూల్ జరుపుతాం. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే రెండవ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తాం..’’ అన్నారు. ఇంకా హీరో, హీరోయిన్లు ఈ సినిమా అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-10-07T03:57:40+05:30 IST