హీరో నాని వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ, హిట్ చిత్రాలను నిర్మాతగా నిర్మించిన నాని ఇప్పుడు ‘మీట్ క్యూట్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నాని సోదరి దీప్తి ఘంటా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇందులో ఆకాంక్షా సింగ్ ఓ హీరోయిన్గా నటిస్తోంది. ఉమెన్ సెంట్రిక్ అంథాలజీగా రాబోతున్న ఈ చిత్రంలో ఆకాంక్ష పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యింది. మరి ఈ సినిమా ఈ అమ్మడుకి టాలీవుడ్లో మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ఇది వరకు మళ్లీ రావాలో సుమంత్ సరసన, దేవదాస్ చిత్రంలో నాగ్ సరసన ఆకాంక్ష నటించింది.