సంక్రాంతి బరిలో ఏకే రీమేక్..?

2022 సంక్రాంతి బరిలో 'ఏకే' రీమేక్‌ను దింపాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం' తెలుగు రీమేక్. ఇందులో రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.  పవన్ భార్యగా నిత్యా మీనన్, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ కనిపించనున్నట్టు సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా, కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగిపోయిది. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సెట్స్ మీదకి వచ్చింది. 

ఈ క్రమంలో 'ఏకే' రీమేక్ షూటింగ్ కూడా తిరిగి ప్రారంభించేందుకు సనాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదికి సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాదే ప్రేక్షకుల ముదుకు తీసుకురావాలనుకుంది చిత్ర బృందం. కానీ పరిస్థితులన్ని తారుమారవడంతో 2022 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీనితో పాటే క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' కూడా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మెగా సూర్య బ్యానర్‌పై ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.