కోలీవుడ్‌లో అజిత్ – షాలినిలను బెస్ట్ కపుల్స్‌గా చెబుతారు. ఇద్దరిదీ అనోన్యమైన దాంపత్యం. సోమవారంతో అజిత్– షాలిని వివాహబంధంతో ఒకటై 23 ఏళ్లు పూర్తయింది. అయితే ఈ జంటను ఎప్పుడూ ప్రైవేట్ పార్టీలో చూసింది లేదు. ప్రస్తుతం ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. వెడ్డింగ్ డే సందర్భంగా ఈ జంట పబ్‌కు వెళ్లారు. ఆ ఫొటోను షాలిని స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. సోమవారం వారి 23వ పెళ్లి రోజు సందర్భంగా అజిత్, షాలినిలు రొమాంటిక్ డిన్నర్ డేట్‌కు వెళ్లారు. అక్కడ బ్లూ లైట్లో డాన్స్ చేస్తూ అజిత్ భార్య షాలినినీ వెనక నుంచి హత్తుకుని ముద్దు పెట్టారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది. అభిమానులంతా ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఈ ఫొటోకు ఓ ప్రత్యేకత ఉంది. అజిత్–షాలిని ఏదైనా పార్టీకి హాజరైన ఫొటోలు చూశాం. కానీ ఇలా రొమాంటిక్ ఫొటోలు ఎప్పుడు బయటకు రాలేదు. అజిత్‌కు కుటుంబం అంటే చాలా ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. అజిత్‌ను పెళ్లాడిన శాలినీ సినిమాలకు గుడ్‌బై చెప్పి ఇంటి బాధ్యతలు తీసుకున్నారు.