ఇరాన్‌ బైక్‌ రేసర్‌తో అజిత్‌ భేటీ

ABN , First Publish Date - 2021-09-22T20:32:54+05:30 IST

ఇరాన్‌ దేశానికి చెందిన ప్రముఖ మహిళా బైక్‌ రేసర్‌ మరల్‌ యాజర్ల్‌తో స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీ సందర్భంగా ఇరాన్‌ బైక్‌ రేసర్‌ అనుభవాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఇరాన్‌ బైక్‌ రేసర్‌తో అజిత్‌ భేటీ

ఇరాన్‌ దేశానికి చెందిన ప్రముఖ మహిళా బైక్‌ రేసర్‌ మరల్‌ యాజర్ల్‌తో స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీ సందర్భంగా ఇరాన్‌ బైక్‌ రేసర్‌ అనుభవాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 1981, నవంబరు 18న జన్మించిన ఈమె మోటార్‌ బైక్‌ రేసింగ్‌లో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. కేవలం రేసింగ్‌లోనేకాకుండా ఒక ఫ్యాషన్‌ డిజైనర్‌గా, ఆర్టిస్టుగా, మార్కెటింగ్‌ ప్రొఫెషనల్‌గా, మోటివేషనల్‌ స్పీకర్‌గా, మహిళా హక్కులపై ఒక క్యాంపెయినర్‌గా పలు రంగాల్లో రాణి స్తున్నారు. నార్త్‌ ఇరాన్‌లోని కేలరాబాద్‌లో జన్మించిన డాక్టర్‌ మరల్‌ పూణె విశ్వవిద్యాలయం నుంచి మార్కెటింగ్‌ విభాగంలో డాక్టరేట్‌ అందుకుంది. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ఈమెకు బైక్‌ రేసింగ్‌ అంటే అమితమైన ఇష్టం. 


ఈమె ఆసియా, ఆస్ట్రేలియా, నార్త్‌ అమెరికా, సౌత్‌ అమెరికా, అంటార్టికా, ఆఫ్రికా, యూరోప్‌ ఖండాల్లోని 64 దేశాలను తన బైక్‌పై చుట్టేసింది. అదీకూడా 18 నెలల వ్యవధిలో 1,10,000 కిలోమీటర్ల దూరం ఆమె ప్రయాణించింది. అలాంటి ఫేమస్‌ బైక్‌ రేసర్‌తో హీరో అజిత్‌ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ భేటీకి గల కారణాలు తెలియరాలేదు కానీ అజిత్‌ కూడా స్వతహాగా ఒక బైక్‌ రేసర్‌. ఈయన కూడా అనేక అంతర్జాతీయ   బైక్‌ రేస్‌ల్లో పాల్గొన్నారు. ఇపుడు మరల్‌తో అజిత్‌ సమావేశం కావడంతో ఈయన కూడా ఇదే బైక్‌ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇందులోభాగంగా ఆమె అనుభవాలను, సలహాలను తెలుసుకునేందుకు సమావేశమైనట్టు వార్తలు వస్తున్నాయి.

Updated Date - 2021-09-22T20:32:54+05:30 IST