నేలపైనే నిద్ర... చెప్పులు ధరించకుండా 11 రోజులు... BOLLYWOOD STAR హీరో దీక్ష!

ABN , First Publish Date - 2022-01-13T22:14:45+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. ఇరుముడితో ఆయన మణికంఠుని దర్శించటం ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చగా మారింది. ఆయన దీక్షలో ఉండగా తీసిన ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

నేలపైనే నిద్ర...  చెప్పులు ధరించకుండా 11 రోజులు... BOLLYWOOD STAR హీరో దీక్ష!

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. ఇరుముడితో ఆయన మణికంఠుని దర్శించటం ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చగా మారింది. ఆయన దీక్షలో ఉండగా తీసిన ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. 



అజయ్ దేవగణ్ శబరిమల యాత్రకు ముందు పాటించిన నియమాల గురించి కూడా ప్రస్తుతం బీ-టౌన్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వందల కోట్ల ఆస్తులున్న ఆయన పదకొండు రొజుల పాటూ నేల మీద ఓ చాప పరుచుకుని పడుకున్నాడట. కేవలం మంచం, పరుపుకి దూరంగా ఉండటమే కాదు దీక్ష సాగినన్ని రోజులు సంపూర్ణ శాఖాహారం తీసుకున్నాడట. ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని కూడా ముట్టుకోలేదని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఇక 11 రోజుల పాటూ ఆయన చెప్పులు లేకుండా తిరగటం కూడా కొంతమందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పర్ఫ్యూమ్, ఆల్కహాల్ వంటివి దేవగణ్ దరి చేరనీయలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా... 


అయ్యప్ప దీక్ష సమయంలో భూ శయనం, చెప్పులు లేకుండా నడవటం దక్షిణాది వారికి పెద్ద వింతేమీ కాదు. అయితే, మన సౌత్ హీరోల మాదిరిగా అయ్యప్ప దీక్ష చేయటం బాలీవుడ్ స్టార్స్‌కి అరుదు. అందుకే, ఈ సారి అజయ్ దేవగణ్ నల్ల బట్టలు ధరించి, తలపై ఇరుముడితో హరిహర నందనుని పద్దెనిమిది మెట్లు ఎక్కటంతో...  ఉత్తరాదిలో అది కాస్తా చర్చకు కారణమైంది. 

Updated Date - 2022-01-13T22:14:45+05:30 IST