‘‘ ఖైదీ’’ షూటింగ్ ప్రారంభించిన అజయ్ దేవగణ్

కోలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోను తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తి. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘‘ ఖైదీ’’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలో నారాయణన్, దీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్. ప్రభు నిర్మాతలుగా వ్యవహరించారు. ఆ సినిమా 2019న అక్టోబర్ 25న విడుదల అయింది. కోలీవుడ్‌తో‌ పాటు టాలీవుడ్‌లోను  భారీ విజయాన్ని సాధించింది. 


‘‘ ఖైదీ’’ ని హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేస్తున్నారు. ఆ రీమేక్‌కు ‘‘ భోలా’’ అని టైటిల్ పెట్టారు. ఆ సినిమాలో అజయ్ సరసన టబు హీరోయిన్‌గా నటించనుందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ‘‘ భోలా’’ కు ధర్మేంద్ర శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ రీమేక్‌కు ఎస్‌ఆర్. ప్రకాశ్‌బాబు, రిలయన్స్ ఎంటర్ టైన్‌మెంట్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా జనవరి 13న  ఆ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తుండటంతో చాలా తక్కువ మంది సిబ్బందితో సినిమా షూటింగ్‌ను చేస్తున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.