Aryan Khan అరెస్ట్ అయితే నాకేంటి..? అది Shah Rukh Khan పర్సనల్ వ్యవహారం.. Ajay Devgn వైఖరితో విస్మయం..!

ABN , First Publish Date - 2021-10-20T21:20:58+05:30 IST

డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్యన్ ఖాన్‌కు బాలీవుడ్ నుంచి మద్దతు బాగానే లభిస్తోంది.

Aryan Khan అరెస్ట్ అయితే నాకేంటి..? అది Shah Rukh Khan పర్సనల్ వ్యవహారం.. Ajay Devgn వైఖరితో విస్మయం..!

డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్యన్ ఖాన్‌కు బాలీవుడ్ నుంచి మద్దతు బాగానే లభిస్తోంది. కష్ట కాలంలో షారూక్ ఖాన్‌కు బాలీవుడ్ ప్రముఖులందరూ అండగా నిలుస్తున్నారు. అయితే ప్రముఖ హీరో అజయ్ దేవ్‌గణ్‌ మాత్రం భిన్నంగా వ్యవహరించడం ఆసక్తిగా మారింది. అజయ్ వైఖరి బాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్ విషయంలో అజయ్ ప్రవర్తన చాలా మందికి విస్మయం కలిగిస్తోంది. అజయ్, షారూక్ కలిసి ఓ పాన్ మసాలా యాడ్ చేసేందుకు అంగీకరించారు. 


ఈ నెల 5వ తేదీన ఆ యాడ్ షూటింగ్ పెట్టుకున్నారు. అజయ్ చెప్పిన సమయానికి ఆరోజు షూటింగ్‌కు వెళ్లాడు. అయితే ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో షారూక్ మాత్రం షూటింగ్‌కు హాజరు కాలేదు. దీంతో ఆ రోజు షూటింగ్ రద్దు అయింది. మరో రోజు షూటింగ్‌కు హాజరు కావాల్సిందిగా యాడ్ సిబ్బంది కోరగా.. అందుకు అజయ్ `నో` చెప్పాడట. షారూక్ పర్సనల్ విషయాలతో షూటింగ్‌కు రాకపోతే దానికి తానేం చేయాలని ప్రశ్నించాడట. అగ్రిమెంట్ ప్రకారం తాను షూటింగ్ స్పాట్‌కు వచ్చానని, వేరే నటుడు రాలేదని షూటింగ్ క్యాన్సిల్ చేస్తే దానికి తన బాధ్యత లేదని అన్నాడట. మళ్లీ షూటింగ్‌కు వచ్చేది లేదని తేల్చి చెప్పాడట. దీంతో అజయ్ వైఖరి బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2021-10-20T21:20:58+05:30 IST