ఐశ్వర్యా రాజేష్‌ తాపత్రయం

తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్‌ 'ఫ్యామిలీ హీరోయిన్ అనే ఇమేజ్‌ నుంచి బయటపడాలని తెగ తాపత్రయపడుతోందట. ప్రతి దశకంలోనూ తమ సినీ కెరీర్‌ తారాస్థాయిలో ఉన్నపుడు మాస్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన ప్రతి హీరోయిన్‌కి వుంటుంది. కెరీర్‌ ప్రారంభంలో చిత్ర పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఎలాంటి పాత్రలు చేసేందుకైనా హీరోయిన్స్ ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా ప్రారంభంలో కుటుంబ పాత్రలను పోషిస్తే, ఆ ఇమేజ్‌ అలాగే స్థిరపడిపోతుంది. అలాంటి యువ హీరోయిన్స్‌లో ఐశ్వర్యా రాజేష్‌ ఒకరు. ఈమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం 'అట్టకత్తి'. ఇందులో ఆమె ఉత్తర చెన్నై మహిళగా నటించింది. తన తొలి చిత్రంలో ఇలాంటి పాత్రలో నటించడం వలనేమో ఏమో తెలియదుకానీ, ఐశ్వర్యాకు వరుసగా అలాంటి పాత్రలు చేసే అవకాశమే దక్కింది. 'కాక్కాముట్టై' అనే చిత్రంలో ఐశ్వర్య నటనకు జాతీయ అవార్డు రావొచ్చని చర్చలు కూడా సాగాయి. 

ఇద్దరు చిన్న పిల్లలకు తల్లిగా ఐశ్వర్య పాత్రలో జీవించింది. ఈ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టినప్పటికీ, మాస్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో తనకు ఉన్న ఫ్యామిలీ ఇమేజ్‌ నుంచి బయటపడాలని ఐశ్వర్య శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆమె సోషల్‌ మీడియాను వేదికగా, ప్రత్యేక ఫొటోషూట్‌లు చేస్తూ వాటిని పోస్టు చేస్తూ నెటిజన్లతో పాటు సినీఇండస్ట్రీ దృష్టిని తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఆమె రిలీజ్‌ చేసిన ఫొటోలు ఈ విషయాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. ఈ ఫొటోలను చూసే దర్శక నిర్మాతలు గ్లామర్ రోల్స్ ఆఫర్ చేస్తారేమో చూడాలి.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.