Aishwarya Rajesh: కమర్షియల్‌ సినిమా అంత ఈజీ కాదు!

ABN , First Publish Date - 2021-09-27T01:06:22+05:30 IST

ఐశ్వర్యారాజేశ్‌ తెలుగింటి కథానాయిక. కెరీర్‌ మొదలుపెట్టింది తమిళ చిత్రాలతో అయినా తెలుగులోనూ మంచి అవకాశాలు అందుకుంటూ తెలుగమ్మాయిగా తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఆమె నటించిన ‘రిపబ్లిక్‌’ చిత్రం వచ్చే నెల ఒకటో తేదిన ప్రేక్షకుల ముందుకొస్తుంది. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జె.భగవాన్‌–పుల్లారావు నిర్మించారు. ఈ సందర్భంగా ఐశ్వర్యారాజేశ్‌ విలేకర్లతో ముచ్చటించారు.

Aishwarya Rajesh: కమర్షియల్‌ సినిమా అంత ఈజీ కాదు!

ఐశ్వర్యారాజేశ్‌ తెలుగింటి కథానాయిక. కెరీర్‌ మొదలుపెట్టింది తమిళ చిత్రాలతో అయినా తెలుగులోనూ మంచి అవకాశాలు అందుకుంటూ తెలుగమ్మాయిగా తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఆమె నటించిన ‘రిపబ్లిక్‌’ చిత్రం వచ్చే నెల ఒకటో తేదిన ప్రేక్షకుల ముందుకొస్తుంది. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జె.భగవాన్‌–పుల్లారావు నిర్మించారు. ఈ సందర్భంగా ఐశ్వర్యారాజేశ్‌ విలేకర్లతో ముచ్చటించారు. 


ఓ రోజు దేవకట్టాగారు ఫోన్‌ చేసి ‘రిపబ్లిక్‌’ కథ చెప్పి, మైరా పాత్ర ఉందని చెప్పారు. ఆయన బేసిగ్గా హీరో, హీరోయిన్‌ అని కాకుండా క్యారెక్టర్స్‌ ఇంపార్టెన్స్‌ గురించి చూస్తారు. కరోనా కారణంగా ఫోన్‌లోనే గంటసేపు కథ చెప్పారు. పరిస్థితులు సర్దుమణిగాక హైదరాబాద్‌ వచ్చి కలిసిన తర్వాత ఐదారు గంటల పాటు కథ నెరేట్‌ చేశారు. ఇందులో ఎన్‌ఆర్‌ఐగా కనిపిస్తా. ఓ సమస్య కారణంగా విదేశాల్లో ఉండే నా పాత్ర ఇండియాకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరం. రొటీన్‌గా సాంగ్స్‌ పాడుకునేలా ఇందులో హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ట్రాక్‌ ఉండదు. సినిమాలో ప్రపోజ్‌ చేేస సీన్‌ కూడా ఉండదు. చాలా మెచూర్డ్‌గా కథ నడుస్తుంది. ఇందులో ప్రతి పాత్ర కీలకమే! 


– రిపబ్లిక్‌ కమర్షియల్‌ సినిమా కాదు. కొత్త కథ. రియల్‌ స్టోరీని తీసుకుని బలమైన ప్లాట్‌ను బేస్‌ చేసుకుని దేవ కట్టా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతిదీ హండ్రెడ్‌ పర్సెంట్‌ ఉండాలనుకునే వ్యక్తి ఆయన. ఈ సినిమాకు 22 రోజులు పని చేశా. డబ్బింగ్‌ చెప్పడానికి 15 రోజులు పట్టింది. దీనిని బట్టి దర్శకుడు ఎంత పర్‌ఫెక్షన్‌ కోరుకున్నారో అర్థం చేసుకోవచ్చు. 

 

- సినిమా అనేది మన జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే మనం సినిమా చూసినప్పుడు ఏదో ఒక  పాయింట్‌కు కనెక్ట్‌ అవుతుంటాం. అలాంటి ఓ బలమైన సినిమా మాధ్యమంలో సమాజానికి అవసరమైన ఓ విషయాన్ని వివరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 



- తేజ్‌ జెమ్‌లాంటి హీరో. సినిమాలో ప్రజల తరపున మాట్లాడే పాత్రలో తను నటించాడు. స్కూల్‌కు వెళ్లే పిల్లాడిలా ఉదయం పదిన్నరకల్లా వచ్చేవాడు. ఓ బుక్‌ పెట్టుకుని అందులో డైలాగ్స్‌ రాసుకుని ప్రాక్టీస్‌ చేేసవాడు. ఇందులో కోర్టు రూమ్‌ సీన్‌ ఉంది. పది నిమిషాలపాటు సాగే ఆ సీన్‌ను తేజ్‌ సింగిల్‌ టేక్‌లో చేశాడు. అంతగా ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఆ సీన్‌ చిత్రీకరణ అయ్యాక యూనిట్‌ అంతా క్లాప్స్‌ కొట్టారు. తన కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని నేను నమ్ముతున్నా. 


- సినిమా సినిమాకు నేను తెలుగు అమ్మాయిననే నమ్మకం బలపడుతోంది. మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే నటనకు స్కోపున్న సినిమాల కోసమే ఎదురుచూస్తున్నా. రిపబ్లిక్‌ తర్వాత కిరణ్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. తమిళ సినిమాలు కొన్ని సెట్స్‌ మీదున్నాయి. 


- కొత్తతరం రావడంతో ఇండస్ట్రీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇటీవల బుచ్చిబాబుగారిని కలిశాను. మీ వర్కింగ్‌ స్టైల్‌ బావుంటుంది. మీతో వర్క్‌ చేయాలనుందని చెప్పారు. ఆయన డైరెక్ట్‌ చేసిన ‘ఉప్పెన’లో కృతిశెట్టి.. ఓ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. అయితే కమర్షియల్‌ మూవీ కారణంగానే ఆమె స్టార్‌ కాలేదు. తన నటన వల్ల స్టార్‌డమ్‌ సొంతం చేసుకుంది. అలాగని కమర్షియల్‌ హీరోయిన్స్‌గా చేయడం సులభమని కాదు. 


- మా కుటుంబం ఉండేది చెన్పైలో అయినప్పటికీ ఆహారపు అలవాట్లు, పనులు తెలుగింట ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మేం ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్లి మేం మన స్టైల్లో తింటుంటే విచిత్రంగా చూస్తారు. నాకు వంట బాగా వచ్చు. చేపల పులుసు, చికెన్‌ బాగా చేస్తా. ఇతర వంటలూ రుచికరంగానే చేస్తా. 

Updated Date - 2021-09-27T01:06:22+05:30 IST