వైరల్‌గా మారిన ఐశ్వర్య రాయ్ కూతురి వీడియో.. కొరియన్ పాప్ స్టార్ మాదిరిగానే ఉందంటూ కామెంట్స్..

ABN , First Publish Date - 2022-01-30T22:42:26+05:30 IST

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్. తాజాగా ఆరాధ్యకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వెలుగులోకి

వైరల్‌గా మారిన ఐశ్వర్య రాయ్ కూతురి వీడియో.. కొరియన్ పాప్ స్టార్ మాదిరిగానే ఉందంటూ కామెంట్స్..

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్. తాజాగా ఆరాధ్యకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వెలుగులోకి వచ్చింది. వైరల్‌గా మారింది. ఐశ్వర్య అభిమానులు ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..


గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరాధ్య ఒక కార్యక్రమంలో పాల్గొంది. ధీరూబాయ్ అంబానీ స్కూల్‌లో ఈ కార్యక్రమం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె ‘సారే జహాసే అచ్చా, మా తుఝే సలాం‘ పాటలను పాడుతూ అభినయించింది. ఆ వీడియో పోస్ట్ చేయగానే కాస్సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొరియన్ పాప్ స్టార్ లీసా మాదిరిగానే ఉందని ఐశ్వర్య అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ‘‘లీసాకు జిరాక్స్ లానే ఆమె ఉంది’’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘‘ ఆరాధ్య జీవితంలో ఒక్కసారయిన తప్పకుండా లీసాను కలుసుకోవాలి. ప్రపంచంలో ఒకరిని పోలిన మనుషులు మరోకరు ఏడుగురు ఊంటారని చెబుతారు’’ అని మరొకరు రిప్లై ఇచ్చారు. ‘‘తల్లిలానే ఆమెకు కూడా చాలా ప్రతిభ ఉంది’’ అని ఓ నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశారు. ‘‘ఐశ్వర్య కళ్లే ఆమెకు వచ్చాయి’’ అని మరో సోషల్ మీడియా యూజర్ స్పందించారు. 


లీసా కొరియన్ పాప్ స్టార్. ‘బ్లాక్ పింక్’ అనే బృందంలో ఆమె సభ్యురాలు. గత ఏడాది ‘లాలీసా’ అనే పేరుతో అల్బమ్‌ను విడుదల చేసింది.





Updated Date - 2022-01-30T22:42:26+05:30 IST