‘The Letter’ : హీందీ వద్దు... ఇంగ్లీష్ లేఖ రాసేద్దామన్న ఐష్!

ABN , First Publish Date - 2021-12-06T23:33:56+05:30 IST

మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’. భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాలో ఐశ్వర్యది రాజుల కాలం నాటి పాత్ర! ‘పొన్నియన్ సెల్వన్’ తరువాత మరో విభిన్నమైన సినిమాకు పచ్చ జెండా ఊపింది ఐష్...

‘The Letter’ : హీందీ వద్దు... ఇంగ్లీష్ లేఖ రాసేద్దామన్న ఐష్!

పెళ్లి తరువాత, కూతురు పుట్టాక ఐశ్వర్య రాయ్ బాగా సెలవిక్టివ్‌గా మారిపోయింది. ఆమె రాశి కంటే వాసి ముఖ్యమన్నట్టుగా సినిమాలు ఎంచుకుంటోంది. ప్రస్తుతం ఆమె నటించిన సినిమా ఒకే ఒక్కటి విడుదలకి సిద్ధమవుతోంది. అదే... మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’. భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాలో ఐశ్వర్యది రాజుల కాలం నాటి పాత్ర! 


‘పొన్నియన్ సెల్వన్’ తరువాత మరో విభిన్నమైన సినిమాకు పచ్చ జెండా ఊపింది ఐష్. ఈసారి హిందీ కాకుండా ఇంగ్లీష్ సినిమాకు సై అంది. ‘ద లెటర్’ అనే ఇండో అమెరికన్ ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య రాయ్ నటించనుంది. లెజెండ్రీ రైటర్ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘త్రీ ఉమెన్’ అనే పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. ఇషితా గంగూలీ సారథ్యం వహిస్తారు. ఆమె బెంగాలీ గాయినీ, ప్రఖ్యాత రంగస్థల రచయిత్రి, దర్శకురాలు కూడా. నిజానికి కరోనా లాక్‌డౌన్‌కి ముందే ఐశ్వర్యకి డైరెక్టర్ ఇషితా స్క్రిప్ట్ అందజేసిందట. అప్పట్లో ‘ద లెటర్’ మూవీని హిందీలో రూపొందించాలని అనుకున్నారట. కానీ, స్క్రిప్ట్ చదివిన మిసెస్ బచ్చన్ సినిమా ఇంగ్లీష్ భాషలో తీస్తే అమెరికన్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారని అభిప్రాయపడిందట. దాంతో ‘ద లెటర్’ ఇండో అమెరికన్ ప్రాజెక్ట్‌గా మారిపోయింది...

Updated Date - 2021-12-06T23:33:56+05:30 IST