‘గాడ్సే’ సినిమాను ఆపేయాలంటూ ప్రధానికి సినీ వర్కర్ల లేఖ

ABN , First Publish Date - 2022-01-24T02:06:21+05:30 IST

ఈ సినిమా ప్రకటన నుంచి దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. గాంధీ సిద్ధాంతాల్ని దేశంతో పాటు ప్రపంచం మొత్తం పాటిస్తుందని అయితే గాంధీ హంతకుడిని మంచివాడిని చేస్తూ గాంధీని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నట్లుగా..

‘గాడ్సే’ సినిమాను ఆపేయాలంటూ ప్రధానికి సినీ వర్కర్ల లేఖ

ముంబై: మహాత్మా గాంధీ హత్య ప్రధాన ఇతివృత్తంగా ‘వై ఐ కిల్ల్‌డ్ గాంధీ’ (నేను గాంధీని ఎందుకు చంపానంటే) అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) లేఖ రాసింది. ‘‘నాథూరాం గాడ్సే దేశద్రోహి. భారత జాతి పిత అయిన గాంధీని చంపిన హంతకుడు’’ అని మోదీకి రాసిన లేఖలో ఏఐసీడబ్ల్యూఏ సభ్యులు పేర్కొన్నారు.


ఈ సినిమా ప్రకటన నుంచి దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. గాంధీ సిద్ధాంతాల్ని దేశంతో పాటు ప్రపంచం మొత్తం పాటిస్తుందని అయితే గాంధీ హంతకుడిని మంచివాడిని చేస్తూ గాంధీని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తోందని బాహాటంగానే విమర్శిస్తున్నారు. గాడ్సే ఇసుమంత గౌరవానికి కూడా అర్హుడు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో గాడ్సే పాత్ర పోషిస్తున్న ఎంపీపై కూడా విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం ప్రకారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగేతర కార్యలపాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ సినిమా విడుదలైతే జనవరి 30, 1948న జరిగిన ఘోరమైన నేరాన్ని చూసి యావత్ దేశం దిగ్భ్రాంతికి గురవుతుందని ఏఐసీడబ్ల్యూఏ సభ్యులు అన్నారు.

Updated Date - 2022-01-24T02:06:21+05:30 IST