మ‌రోసారి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌బోతోన్న ‘ఆహా’

ABN , First Publish Date - 2021-07-23T03:26:49+05:30 IST

ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది ‘ఆహా’ ఓటీటీ. హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మమైన ‘ఆహా’లో బ్లాక్‌బ‌స్ట‌ర్ సర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ ‘లాక్డ్‌’ రెండో

మ‌రోసారి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌బోతోన్న ‘ఆహా’

ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది ‘ఆహా’ ఓటీటీ. హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మమైన ‘ఆహా’లో బ్లాక్‌బ‌స్ట‌ర్ సర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ ‘లాక్డ్‌’ రెండో సీజ‌న్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. వైద్య‌శాస్త్రంలో క‌ఠిన‌త‌ర‌మైన ఎన్నో కేసుల‌కు ప‌రిష్కారాల‌ను సూచించిన గొప్ప న్యూరో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఆనంద్ పాత్ర‌లో మెప్పించ‌డానికి స‌త్య‌దేవ్ మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నారు. ‘లాక్డ్‌’ సీజ‌న్ 1ను డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ దేవ కుమారే ఈ సీజ‌న్‌ను కూడా డైరెక్ట్ చేయ‌బోతున్నారు. 


‘‘సంయుక్తా హెగ్డే, కేశ‌వ్ దీప‌క్‌, శ్రీల‌క్ష్మి, బిందు చంద్ర‌మౌళి త‌దిత‌రులు న‌టించిన తొలి సీజ‌న్ ప్రేక్ష‌కుల‌కు ప‌లు ట్విస్టులు, టర్న్‌లతో ప్రేక్ష‌కులు ఓ ఉత్కంఠ‌త‌కు లోన‌య్యారు. కథ ప‌రంగా.. స్కేల్‌, విజ‌న్ ప‌రంగానే కాకుండా ‘లాక్డ్’ రెండో సీజ‌న్ వెన్నులో ఓ భ‌యాన్ని క‌లిగించేంత ఎలిమెంట్స్‌తో తెలుగు మాధ్య‌మాల్లో  మేకింగ్ స్టాండ‌ర్స్ ప‌రంగానూ స‌రికొత్త అర్థాన్ని చెప్పేలా ఉండ‌బోతుంది. త్వ‌ర‌లోనే ఈ సీజన్ 2ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాం’’ అని ‘ఆహా’ సంస్థ ప్రకటించింది.

Updated Date - 2021-07-23T03:26:49+05:30 IST