డ్రగ్స్‌ కేసులో తమ్ముడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-09-26T06:52:00+05:30 IST

హిందీ నటుడు అర్జున్‌ రాంపాల్‌ గాళ్‌ఫెండ్ర్‌ గబ్రియెలా తమ్ముడు అజిసిలోష్‌ను శుక్రవారం నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు గోవా పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్‌ పెడ్లర్స్‌ కోసం సాగించిన అన్వేషణలో అతను చిక్కాడు....

డ్రగ్స్‌ కేసులో తమ్ముడి అరెస్ట్‌

హిందీ నటుడు అర్జున్‌ రాంపాల్‌ గాళ్‌ఫెండ్ర్‌ గబ్రియెలా తమ్ముడు అజిసిలోష్‌ను శుక్రవారం నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు గోవా పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్‌ పెడ్లర్స్‌ కోసం సాగించిన అన్వేషణలో అతను చిక్కాడు. కోర్టు రెండు వారాలు జ్యుడిషియల్‌ కస్టడీ విధించినట్టు సమాచారం. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డ్రగ్స్‌ కేసులో గతేడాది అక్టోబర్‌లో తొలిసారి, ఆ తర్వాత నైజీరియన్‌ కొకైన్‌ కేసులో రెండోసారి, ఇప్పుడు గోవాలో మూడోసారి అజిసిలోష్‌ అరెస్ట్‌ కావడం గమనార్హం. గతేడాది అర్జున్‌ రాంపాల్‌, గబ్రియెలాకూ పోలీసులు సమన్లు జారీ చేసి విచారించారు. తెలుగులో ‘ఊపిరి’ చిత్రంలో జెన్నీ పాత్రలో గబ్రియెలా నటించారు.

Updated Date - 2021-09-26T06:52:00+05:30 IST