టార్గెట్ మిస్ అవనంటున్న 'ఏజెంట్'..!

అఖిల్ అక్కినేని నటి స్తున్న లేటెస్ట్ మూవీ 'ఏజెంట్'. ఈ సినిమా అనుకున్న రిలీజ్ టార్గెట్ మిస్ అవనమని చిత్రం బృందం అంటోందట. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ రెడ్డి 2 బ్యానర్స్‌పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలన్ని పోస్ట్‌పోన్ అయ్యాయి. ఈ క్రమంలో అఖిల్ - సురేందర్ రెడ్డిల 'ఏజెంట్' కూడా పోస్ట్‌పోన్ అవుతుందని టాక్ వినిపించింది. అయితే చిత్ర బృందం అధికారకంగా ప్రకటించిన డిసెంబర్ 24వ తేదీనే రిలీజ్ చేయనునట్టు తెలుసోంది. అనుకున్న సమయానికే సినిమా రిలీజ్ చేసేలా మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారట. ఈలోపే అఖిల్ - పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మోస్ట్ ఎలిజిబుల్‌బ్యాచ్‌లర్' విడుదల కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు, వాసువర్మ నిర్మిస్తున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.