షారూక్ చిత్రం తర్వాత.. మళ్లీ బిగిలూ..!

అగ్రనటుడు విజయ్‌ - దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ‘తెరి’, ‘మెర్సల్‌’, ‘బిగిల్‌’ చిత్రాలు వచ్చాయి. ఈ మూడు ఘన విజయం సాధించాయి. ఇపుడు ఈ కాంబినేషన్‌ మరోమారు రిపీట్‌ కానుందనే వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం హీరో విజయ్‌ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న ‘బీస్ట్‌’ చిత్రంలో నటిస్తున్నారు. నిర్మాత కళానిధి మారన్‌ సన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్‌. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అలాగే, దర్శకుడు అట్లీ కూడా ఓ బాలీవుడ్‌ ప్రాజెక్టు చేస్తున్నారు. షారూక్‌ ఖాన్‌, నయనతార జంటగా ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్‌ నటించే తదుపరి ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్‌ చేపట్టనుంది. ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. షారూక్‌ ఖాన్‌ ప్రాజెక్టును పూర్తిచేసిన అనంతరం విజయ్‌ చిత్ర స్ర్కిప్టు పనులను అట్లీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.