Salman Khan బెదింపుల ఘటన మరచిపోకముందే.. మరో బాలీవుడ్ నటిని చంపేస్తామంటూ లేఖ..

ABN , First Publish Date - 2022-06-30T01:15:37+05:30 IST

సల్మా‌న్ ఖాన్‌ (Salman Khan) కు బెదిరింపులు ఎదురయిన ఘటనను మరచిపోకముందే, మరో బాలీవుడ్ నటిని చంపేస్తామంటూ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు తాజాగా లేఖను రాశారు. వివరాల్లోకి వెళితే..

Salman Khan బెదింపుల ఘటన మరచిపోకముందే.. మరో బాలీవుడ్ నటిని చంపేస్తామంటూ లేఖ..

సల్మా‌న్ ఖాన్‌ (Salman Khan) కు ఎదురయిన బెదిరింపులు ఘటనను మరచిపోకముందే, మరో బాలీవుడ్ నటిని చంపేస్తామంటూ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు తాజాగా లేఖను రాశారు. వివరాల్లోకి వెళితే.. సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందించే నటి స్వర భాస్కర్ (Swara Bhasker). ముంబైలోని వెర్సోవాలో నివాసముంటున్నారు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను చంపేస్తామని వెర్సోవాలోని ఇంటికి హిందీలో లేఖను పంపించారు. దీంతో వారికి వ్యతిరేకంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని జూన్ 29న పోలీసులు తెలిపారు. 


కొన్నేళ్ల క్రితం వీర్ సావర్కర్‌కు సంబంధించి ఓ వెబ్‌సైట్‌లో కథనం వచ్చింది. ఆ స్టోరీపై స్వర భాస్కర్ స్పందించారు. ‘‘జైలు నుంచి బయటకు రావడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి సావర్కర్ క్షమాపణలు చెప్పారు. అందువల్ల ఆయన ‘వీర్’ ఎప్పటికి కాదు’’ అని ట్విట్టర్‌లో అప్పుడు స్వర పోస్ట్ పెట్టారు. అనంతరం వీర్ సావర్కర్‌పై మరో ట్వీట్ కూడా చేశారు. దీంతో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ హిందీలో లేఖను రాశారు. సావర్కర్‌కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినందుకు ఆమెను చంపేస్తామంటూ పరుష పదుజాలాన్ని ఆ లేఖలో వాడారు. ఆయనకు వ్యతిరేకంగా ఏ వ్యాఖ్యలు చేసిన సహించబోమన్నారు. దేశానికి చెందిన యువత ఆ లేఖను రాసినంటూ చివరలో పేర్కొన్నారు. తాజాగా ఉదయ్ పూర్ టైలర్ హత్యపై కూడా స్వర భాస్కర్ స్పందించారు. స్వర‌కు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. అయినప్పటికి పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నట్టు కొంత కాలం క్రితం సోషల్ మీడియా వేదికగా చెప్పారు. దత్తత కోసం సెంట్రల్ అడాఫ్టేషన్ రిసోర్సెస్ అథారిటీ(CARA) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వెల్లడించారు. 





Updated Date - 2022-06-30T01:15:37+05:30 IST