ఇంటికి తిరిగొచ్చా! -అడివి శేష్‌

యువ కథానాయకుడు అడివి శేష్‌ ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చారు. ఆయన డెంగ్యూ జ్వరం బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో ఈ నెల 18న ఆస్పత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జి అయ్యారు. ‘‘ఇంటికి తిరిగొచ్చాను. విశ్రాంతి తీసుకుంటున్నా... కోలుకుంటున్నాను’’ అని అడివి శేష్‌ తెలిపారు. సినిమాలకు వస్తే... ‘మేజర్‌’, ‘హిట్‌-2’ చిత్రాల్లో నటిస్తున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.