ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అదిరే అభి సినిమా

ABN , First Publish Date - 2021-09-26T21:00:13+05:30 IST

ప్రభాస్ డెబ్యూ మూవీ ‘ఈశ్వర్’ తో టాలీవుడ్ లో నటుడిగా ప్రవేశించిన అభినయ కృష్ణ.. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆపై జబర్దస్త్ కామెడీ షోతో అదిరే అభిగా అవతరించి.. మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా అభి ఓ సినిమాతో హీరోగా కూడా మారుతున్నాడు.

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అదిరే అభి సినిమా

ప్రభాస్ డెబ్యూ మూవీ ‘ఈశ్వర్’ తో టాలీవుడ్ లో నటుడిగా ప్రవేశించిన అభినయ కృష్ణ.. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆపై జబర్దస్త్ కామెడీ షోతో అదిరే అభిగా అవతరించి.. మంచి పేరు తెచ్చుకున్నాడు.  తాజాగా అభి ఓ సినిమాతో హీరోగా కూడా మారుతున్నాడు. సినిమా పేరు ‘వైట్ పేపర్’.  జీ.యస్.కే ప్రొడక్షన్స్ బ్యానర్ పై గ్రంధే శివ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ను కేవలం 9గంటల 51 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేశారు. దాంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ సినిమాను అరుదైన చిత్రంగా గుర్తించి సత్కరించారు. 


అదిరే అభి పుట్టిన రోజున సందర్భాన్ని పురస్కరించుకొని రీసెంట్ గా ‘వైట్ పేపర్’ సినిమా టైటిల్ లుక్ ను మనో, ఇంద్రజ, అనసూయ  లాంచ్ చేశారు. అదిరే అభి, వాణి, తల్లాడ సాయి కృష్ణ, నేహా, నందకిషోర్ తదితరులు నటించిన ఈ సినిమా టైటిల్ లాంఛ్ చేయడం తమకు చాలా ఆనందాన్నిచ్చిందని మనో, ఇంద్రజ, అనసూయ తెలిపారు.  

Updated Date - 2021-09-26T21:00:13+05:30 IST