Sonal Chowhan: Adipurush హిస్టరీలో ఒక భాగం.. ట్రెండ్ సెట్టర్
ABN , First Publish Date - 2022-09-25T02:12:11+05:30 IST
‘‘నేను ప్రభాస్‌కు వీరాభిమానిని అన్న విషయం అందరికీ తెలిసింది. ‘ఆదిపురుష్’లో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి చిత్రం చేయడం అంటే హిస్టరీలో ఒక భాగం అయినట్లే.
‘‘నేను ప్రభాస్(Prabhas)కు వీరాభిమానిని అన్న విషయం అందరికీ తెలిసింది. ‘ఆదిపురుష్’(Adipurush)లో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి చిత్రం చేయడం అంటే హిస్టరీలో ఒక భాగం అయినట్లే. ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ రాగానే నిమిషం ఆలోచించకుండా ఓకే చెప్పేశా. ఈ సినిమా కోసం ఎదురు చూస్తోంది’’ అని సోనల్ చౌహన్ (Sonal Chouhan)అన్నారు. తాజాగా ఆమె నటించిన ‘ఘోస్ట్’ చిత్రం అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ‘ఆదిపురుష్’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఇందులో మీది సూర్పణక పాత్ర అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకుండా దాటేశారు. (Adipurush trend setter)
‘‘ఈ తరం వారు రామాయణం, మహాభారతం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మన సంస్కృతీ సంప్రదాయాలను తెలుకోవలసిన బాధ్యత మనపై ఉంది. నాకు చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు రామాయణ, మహాభారతాలు చూపించారు. ఈ కథ వినడానికి వెళ్లినప్పుడు నాకు రామాయణం గురించి తెలుసు అని చెప్పడానికి గర్వించాను. ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ పరంగా ‘ఆదిపురుష్’ ట్రెండ్ సెట్ చేస్తుంది. దర్శకుడు ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. ప్రతి అంశంలోనూ ‘ఆదిపురుష్’ సరికొత్త మార్పు తీసుకు వస్తుందని, దర్శకుడు ఓంరౌత్ జీనియస్ ’’ అని చెప్పుకొచ్చారు.