Prabhas: చిన్నపిల్లాడ్ని అయిపోయా

ABN , First Publish Date - 2022-10-07T03:28:49+05:30 IST

‘‘ఆదిపురుష్‌ (Adipurush)టీజర్‌ని తొలిసారి త్రీడీలో చూసినప్పుడు నేను చిన్నపిల్లాడ్ని అయిపోయా. నా సినిమా త్రీడీలో రావడం ఇదే తొలిసారి. ఆ విజువల్స్‌ చూసి థ్రిల్‌ ఫీల్‌ అయ్యా’’ అన్నారు ప్రభాస్‌(Prabhas). ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇటీవల టీజర్‌ విడుదలైంది.

Prabhas: చిన్నపిల్లాడ్ని అయిపోయా

‘‘ఆదిపురుష్‌ (Adipurush)టీజర్‌ని తొలిసారి త్రీడీలో చూసినప్పుడు నేను చిన్నపిల్లాడ్ని అయిపోయా. నా సినిమా త్రీడీలో రావడం ఇదే తొలిసారి. ఆ విజువల్స్‌ చూసి థ్రిల్‌ ఫీల్‌ అయ్యా’’ అన్నారు ప్రభాస్‌(Prabhas). ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇటీవల టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌ త్రీడీ (Adipurush 3D teaser) వెర్షన్‌ టీజర్‌ను హైదరాబాద్‌లో పాత్రికేయుల కోసం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘శుక్రవారం అభిమానుల కోసం 60 థియేటర్లలో త్రీడీ టీజర్‌ని ప్రదర్శిస్తాం. వాళ్లు చూసి ఎలా ఫీల్‌ అవుతారో తెలుసుకోవాలని ఉంది. ఇలాంటి టెక్నాలజీతో సినిమా తీయడం దేశంలోనే ఇదే తొలిసారి. పెద్ద తెర కోసం తీసిన సినిమా ఇది. ఇంకొన్ని వారాల్లో మంచి కంటెంట్‌తో మళ్లీ వస్తాం’’ అని అన్నారు. 


చర్చలు అవసరమా: దిల్‌ రాజు

దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘టీజర్‌ కోసం అందరిలా నేనూ ఎదురు చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆది పురుష్‌’ టీజర్‌ ఎప్పుడు వస్తుందా? అని ప్రభాస్‌ ఫ్యాన్సే కాదు... నేనూ ఆసక్తిగా ఎదురు చూశా. టీజర్‌ రాగానే నేనూ మొదట ఫోన్‌లో చూశా. వెంటనే ప్రభాస్‌కు ఫోన్‌ చేేస్త, స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ‘అమేజింగ్‌’ అంటూ వాయిస్‌ మెేసజ్‌ పెట్టా. టీజర్‌ ఎలా ఉందోనని ఐదారుగురికి ఫోన్‌ చేస్తే ‘ట్రోలింగ్‌ చేస్తున్నారు సర్‌’ అని చెప్పారు. ‘బాహుబలి–1’ చూసి బయటకు వచ్చినప్పుడు అందరూ ట్రోలింగ్‌ చేశారు. శివలింగాన్ని ఎత్తుకుని ప్రభాస్‌ వచ్చే ఫొటోకు జండూబామ్‌ పెట్టి పోస్టులు చేశారు. ‘సినిమా సూపర్‌ హిట్‌’ అని ప్రభాస్‌కి  అప్పుడే చెప్పా. ఇలాంటి సినిమాలను థియేటర్‌లోనే చూడాలి. సెల్‌ఫోన్‌లో చూసి సినిమాను అంచనా వేయలేం. ఈ టీమ్‌ కథా నేపథ్యం అలాంటిది. రామాయణం నుంచి ఐడియా తీసుకొని రాముడు, సీత, రావణుడు పాత్రలు తీర్చిదిద్దారు. దీనిపైన కూడా చర్చలు అవసరమా? ‘రావణుడు ఇలా ఉంటాడా? పక్షిమీద ఎందుకు వస్తాడు పూల రథంపై రావాలి కదా?’ అంటున్నారు. నేటి తరం ప్రేక్షకులకు ఏం చూపించాలో అలా తీశారు. ఓం రౌత్‌ ‘ఆదిపురుష్‌’ తీస్తున్నప్పుడు ‘తానాజీ’ చూసి ఆశ్యర్యపోయా. ‘ఆది పురుష్‌’ ఒక మేజిక్‌ ఫిల్మ్‌ అవుతుందని నేను అనుకుంటున్నా. ‘బాహుబలి’, ‘ఆదిపురుష్‌’లాంటి చిత్రాలు విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసమే చూడాలి. సెల్‌ఫోన్లలోనూ, బుల్లితెరపైనా టీజర్‌ చూసినవాళ్లకు నచ్చకపోవొచ్చు. త్రీడీ ఎఫెక్ట్‌లో చూస్తే ఆ అనుభూతి వేరు. ‘బాహుబలి’ విడుదలైన రోజున నెగిటీవ్‌ కామెంట్లు వచ్చాయి. అవి ఏ సినిమాకైనా సహజమే. కొంతమంది సినిమాని నెగిటీవ్‌ మైండ్‌సెట్‌తో చూస్తారు. కానీ అంతిమంగా నచ్చాల్సింది ప్రేక్షకులకే. ప్రభాస్‌  లాంటి స్టార్‌ ఉన్నప్పుడు సినిమా ఆగే ప్రసక్తే లేదు’’ అని అన్నారు. 


ఓం రౌత్‌ మాట్లాడుతూ ‘‘నేను చెప్పాలనుకున్న విషయాన్ని దిల్‌ రాజు చెప్పేశారు. మా సినిమాకు తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి’’ అని అన్నారు. త్రీడీ టీజర్‌కు రెస్పాన్స్‌ అదిరిందని భూషణ్‌ కుమార్‌ చెప్పారు. 



Updated Date - 2022-10-07T03:28:49+05:30 IST