రామ్ కి విలన్‌గా ఆది పినిశెట్టి..?

ABN , First Publish Date - 2021-07-18T17:34:15+05:30 IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసందే. ఇందులో రామ్ పోతినేనికి విలన్‌గా యువ నటుడు ఆది పినిశెట్టి నటించబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

రామ్ కి విలన్‌గా ఆది పినిశెట్టి..?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసందే. ఇందులో రామ్ పోతినేనికి విలన్‌గా యువ నటుడు ఆది పినిశెట్టి నటించబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్స్ హైదరాబాద్, వైజాగ్‌ లో ప్లాన్ చేశారు. 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి రామ్ సరసన నటిస్తోంది. అయితే ఇందులో రామ్ కి విలన్‌గా ముందు సీనియర్ నటుడు మాధవన్ నటించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లేనని స్వయంగా దర్శకుడు వెల్లడించాడు. ఆ తర్వాత తమిళ నటుడు ఆర్య విలన్ రోల్ చేయనున్నట్టు వార్తలుగా, తాజాగా ఆది పినిశెట్టి పేరు వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మేకర్స్ స్పందించేవరకు ఆగాల్సిందే. 

Updated Date - 2021-07-18T17:34:15+05:30 IST