నాలుగు భాషల్లో ‘అధర్వ’

ABN , First Publish Date - 2022-11-08T05:54:48+05:30 IST

కార్తీక్‌రాజు, సిమ్రాన్‌ చౌదరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అధర్వ’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తయారువుతున్న ఈ చిత్రానికి...

నాలుగు భాషల్లో ‘అధర్వ’

కార్తీక్‌రాజు, సిమ్రాన్‌ చౌదరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అధర్వ’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తయారువుతున్న ఈ చిత్రానికి మహేశ్‌రెడ్డి దర్శకుడు. ఓ పక్క షూటింగ్‌ చేస్తూనే మరో వైపు ప్రమోషన్స్‌ చేసి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించారు మేకర్స్‌. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తామని నిర్మాత సుభాష్‌ నూతలపాటి చెప్పారు. శ్రీచరణ్‌ పాకాల  సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: నూతలపాటి నరసిహం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: విజయ, ఝాన్సీ. 


Updated Date - 2022-11-08T05:54:48+05:30 IST