తెలుగు సినిమాల కథలు, అన్ని భాషల సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్, సెన్సార్ కోసం పబ్లిసిటీ క్లియరెన్స్ వంటి కార్యక్రమాలను చేపట్టామనీ, ఇప్పటివరకూ 30 కథలు, 13 టైటిల్స్ రిజిస్టర్ చేశామనీ, తమిళ డబ్బింగ్ చిత్రం ‘ఆకాశవాణి చెన్నై కేంద్రం’, హిందీ అనువాద చిత్రం ‘భూత్ సర్కార్’ లకు సెన్సార్ కోసం పబ్లిసిటీ క్లియరెన్స్ ఇచ్చామనీ నిర్మాతల మండలి కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటనలో తెలిపారు. నిర్మాతల మండలిలో సభ్యత్వం ఉన్న వారికి ఇటువంటి సదుపాయాలు కల్పిస్తున్నామనీ, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్, ఇతర అనుబంధ సంస్థల్లో సభ్యత్వం ఉన్నవారు కూడా కథలను నిర్మాతల మండలిలో రిజిస్టర్ చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే సభ్యులకు తెలుగు ఫిల్మ్ ట్రైలర్స్ పబ్లిసిటీ కన్సెషన్ రేట్లకు చేస్తున్నామనీ, సోషల్ మీడియాలో, ఎలకా్ట్రనిక్ ఛానల్స్‌లో సినిమా పబ్లిసిటీ ఉచితంగా అందిస్తున్నట్లు కూడా వారు ఆ ప్రకటనలో తెలిపారు. అర్హులైన సభ్యులకు మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.