సిమ్ కార్డ్స్ వేరు నంబర్ ఒకటే.. ఆకట్టుకుంటున్న 'అద్భుతం' ట్రైలర్..

ABN , First Publish Date - 2021-11-10T13:42:25+05:30 IST

సిమ్ కార్డ్స్ వేరు నంబర్ మాత్రమే ఒకటే. అంటే ఒకే నంబర్ ఇద్దరికీ ఇచ్చారు. ఇలాంటి వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమా 'అద్భుతం'. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంటోంది.

సిమ్ కార్డ్స్ వేరు నంబర్ ఒకటే.. ఆకట్టుకుంటున్న 'అద్భుతం' ట్రైలర్..

సిమ్ కార్డ్స్ వేరు నంబర్ మాత్రమే ఒకటే. అంటే ఒకే నంబర్ ఇద్దరికీ ఇచ్చారు. ఇలాంటి వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమా 'అద్భుతం'. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంటోంది. తేజ సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ చిత్రం నుండి ట్రైలర్‌ను విడుదల చేయగా.. అన్నీ వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకే ఫోన్ నెంబర్ ఇద్దరికీ ఇస్తే ఏం జరుగుతుంది..? అనే వెరైటీ కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ మూవీని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మోగుల్ల చంద్ర శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 19 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి రధన్ సంగీతదర్శకుడు. 



Updated Date - 2021-11-10T13:42:25+05:30 IST