సురేఖ సిక్రీ ఇకలేరు!

ABN , First Publish Date - 2021-07-16T21:03:39+05:30 IST

సహాయనటిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న బాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖ సిక్రీ(75) కన్నుమూశారు. బ్రెయిన్‌ స్ర్టోక్‌, ఇతర అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆమె శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు.

సురేఖ సిక్రీ ఇకలేరు!

సహాయనటిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న బాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖ సిక్రీ(75) కన్నుమూశారు. బ్రెయిన్‌ స్ర్టోక్‌, ఇతర అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆమె శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నతనం నుంచే సురేఖకు నటన అంటే ఆసక్తి. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో నాటకాలు వేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఎన్నో సీరియళ్లల్లో నటించారు.  ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో ఆమె తెలుగు ప్రేక్షులకు సుపరిచితులయ్యారు. ‘కిస్సా కుర్సీకా’ అనే సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమమై, ఎన్నో సినిమాల్లో సహాయ నటిగా ప్రేక్షకుల్ని అలరించారు. ‘మామో’, ‘తమస్‌’, ‘బధాయి హో’ చిత్రాలకుగాను ఆమె మూడుసార్లు  సహాయనటిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. నటిగా రాణిస్తున్న సమయంలో 2018లో సురేఖ పక్షవాతానికి గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ నటన మీదున్న ఇష్టంలో కోలుకున్న వెంటనే నటించి అందర్నీ మెప్పించారు. ఈ క్రమంలోనే 2020లో ఆమె బ్రెయిన్‌స్ర్టోక్‌కి గురై కాస్త కోలుకున్నారు. ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ ఆమె నటించిన చివరి చిత్రం. సురేఖ సిక్రీ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 


Updated Date - 2021-07-16T21:03:39+05:30 IST