Mirzapur: Season 3 కోసం ఫ్యాన్స్ వెయింటింగ్.. ఇంట్రస్టింగ్ వివరాలు వెల్లడించిన నటి Shweta Tripathi

ABN , First Publish Date - 2022-06-23T19:39:54+05:30 IST

మీర్జాపూర్.. ఈ వెబ్‌సిరీస్‌కి దేశవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్..

Mirzapur: Season 3 కోసం ఫ్యాన్స్ వెయింటింగ్.. ఇంట్రస్టింగ్ వివరాలు వెల్లడించిన నటి Shweta Tripathi

మీర్జాపూర్.. ఈ వెబ్‌సిరీస్‌కి దేశవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. రెండూ కూడా మంచి ప్రేక్షాకాదరణని పొందాయి. రెండో సీజన్ చివరిలో ముఖ్య పాత్రలైన కాలీన్ భయ్యా, మున్నా భయ్యాపై హీరో క్యారెక్టరైన గుడ్డు భయ్యా ఎటాక్ చేస్తాడు. అందులో మున్నా భయ్యా చనిపోగా.. కాలీన్‌కి బుల్లెట్లు తగులుతాయి. ఆ సమయంలో అతన్ని ఫ్రెండ్ శరద్ శుక్లా, కాలీన్‌ని అక్కడి నుంచి తప్పించగా సీజన్ ఎండ్ అవుతుంది. దీంతో సీజన్ 3 (Season 3) ఎలా ఉండబోతోందని ఆ సిరీస్ అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ వెబ్‌సిరీస్‌లో ఫిమేల్ లీడ్‌గా నటించి, పాపులారిటీ సాధించిన శ్వేత త్రిపాఠిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగంగా ఈ నటి మాట్లాడుతూ సీజన్ 3తోపాటు పలు ఆసక్తికర విషయాల గురించి పంచుకుంది.


మీర్జాపూర్ సీజన్ 3 గురించి శ్వేత మాట్లాడుతూ.. ‘సీజన్ 3 షూటింగ్‌ జూన్ 24న‌ ప్రారంభమవుతుంది. జూలై 4 నుంచి నేనూ షూటింగ్‌లో పాల్గొంటా. జూలై 6న నా పుట్టినరోజు. కాబట్టి ఈ బర్త్ ‌డేని ఆ టీం మధ్యలో జరుపుకోబోతుండడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. అలాగే.. ఈ వెబ్‌సిరీస్ నెక్ట్ సీజన్ రావడానికి దాదాపు ఏడాది పట్టొచ్చు. అప్పటి వరకూ అందరూ వెయిట్ చేయాల్సిందే. దాని కోసం నేను కూడా ఎంతో ఏగ్జాయిటెట్‌గా ఉన్నా’ అని తెలిపింది.


సౌత్ ఇండియన్ ఫుడ్ గురించి శ్వేత మాట్లాడుతూ.. ‘నేను ఒక సంవత్సరంపాటు హైదరబాద్‌లోని నిఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నా. అక్కడ ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనే కోర్సు చేశా. ఆ ఏడాది నా జీవితంలో మర్చిపోలేను. అక్కడి ఫుడ్‌ బావుంటుంది. అలాగే మనుషులు కూడా చాలా స్వీట్. ఆ సమయంలోనే నాకు సౌత్ ఇండియన్ ఫుడ్‌తో పరిచయం ఏర్పడింది. దోశ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే చాలా తరచుగా వివిధ రకాల దోశలను ట్రై చేస్తుంటా’ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, స్నేహితులు, లైఫ్ పార్టనర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్, భవిష్యత్తులో చేయబోయే సినిమాలు, ప్రాజెక్టుల గురించి శ్వేత పంచుకుంది.



Updated Date - 2022-06-23T19:39:54+05:30 IST