పెంపుడు కుక్క పుట్టినరోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన Samantha.. వీడియో వైరల్

టాలీవుడ్ హీరోయిన్ సమంతకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. అందుకే హాష్, సాషా అనే రెండు కుక్కలను పెంచుకుంటోంది ఈ తార. అంతేకాకుండా వాటి సంబంధించిన ప్రత్యేక సందర్భాలను సైతం సెలబ్రేట్ చేస్తుంటుంది. తాజాగా పెంపుడు కుక్క హాష్ మూడో బర్త్ డేని సెలబ్రేట్ చేసింది ఈ భామ.


ఈ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన వీడియోని, పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత. ఇందులో హాష్, సాషా స్టైలిష్ ఔట్‌పిట్‌ ధరించి ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా వీటి కోసం పెట్ ఫ్రెండ్లీ కేక్స్ సైతం సిద్ధం చేసింది సామ్. ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసిన ఈ పిక్‌కి ‘నా లిటిల్ బోయ్ త్వరగా పెరుగుతూ.. ఎక్కువ పార్టీ కోసం చూస్తున్నాడు’ అంటూ రాసుకొచ్చింది ఈ తార.


నిజానికి ఈ రెండు డాగ్స్‌ని వివాహం తర్వాత నాగచైతన్య, సమంత కలిసి దత్తత చేసుకున్నారు. అప్పుడు దానికి హష్ అక్కినేని అని పేరు పెట్టగా.. డైవోర్స్ తర్వాత దాని పేరు నుంచి అక్కినేని అనే సర్‌నేమ్‌ని తొలగించింది సామ్.అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.