సల్మాన్ మొదటిసారి కలిసినప్పుడు ముట్టుకోవచ్చా అని అడిగా : నటి

ABN , First Publish Date - 2022-01-24T16:51:09+05:30 IST

ఏ సినిమా ఇండస్ట్రీలో అయిన స్టార్స్ హీరోలకి ప్రత్యేక గౌరవం ఉంటుంది. అందుకే నార్మల్ ఫేమ్ నటీనటులు వారితో మాట్లాడాలన్న..

సల్మాన్ మొదటిసారి కలిసినప్పుడు ముట్టుకోవచ్చా అని అడిగా : నటి

ఏ సినిమా ఇండస్ట్రీలో అయిన స్టార్స్ హీరోలకి ప్రత్యేక గౌరవం ఉంటుంది. అందుకే నార్మల్ ఫేమ్ ఉన్న నటీనటులు వారితో మాట్లాడాలన్న, నటించాలన్న చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. వారికి కోపం రాకుండా నడుచుకుంటూ ఉంటారు. తను సల్మాన్ ఖాన్‌తో నటించేటప్పుడు అలాగే ఫీల్ అయ్యానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది నటి ప్రగ్యా జైస్వాల్.


ఆమె మాట్లాడుతూ.. ‘పాట షూటింగ్ జరిగిన రోజే సల్మాన్‌ని మొదటి సారి కలిశాను. కాబట్టి ఆయనతో ఎలా నడుచుకోవాలో నాకు తెలియదు. ఎవరినైనా మొదటి సారి కలిసినప్పుడు అది భారతీయ సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్‌ని కలిసినప్పుడు అన్ని కరెక్టుగా జరిగేలా చూసుకోవాలి కదా. మనం ఏదైనా తప్పు చేస్తే వారికి కోపం రావచ్చు.


అందుకే ఆయన్ని కలిసిన మొదటిరోజే మిమ్మల్ని టచ్ చేయొచ్చ అని అడిగా. ఎందుకంటే మేం చేయబోయేది ఓ రొమాంటిక్ సాంగ్. అందుకే ఆయన మంచి మూడ్‌లో ఉన్నాడో లేదోనని తెలుసుకోవాలని నా ఉద్దేశ్యం. అలాగే తను ఎక్కువ చేస్తుంది కదా అని అనిపించుకోకూడదని నా ఆలోచన. నేను అలా అడగగానే ‘ఏం పర్లేదు. నువ్వు నన్ను ముట్టుకోవచ్చు’ అని సర్ చెప్పడంతో, తర్వాత షూట్ అంతా ఎంతో కంఫర్ట్‌గా సాగింద’ని ప్రగ్యా చెప్పింది. 


అయితే, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో నుంచి ఎడిటింగ్‌లో తీసేసినా ఓ రొమాంటిక్ సాంగ్‌ని యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. అందులో సల్లు భాయ్‌కి జోడిగా నటించింది ప్రగ్యా జైస్వాల్. ఇది విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించింది. ఆ వీడియోని మీరు ఓ సారి చూసేయండి..



Updated Date - 2022-01-24T16:51:09+05:30 IST