ఊ అంటావా! ఊఊ అంటావా!.. పాటకి ప్రగతి ఊరమాస్ స్టెప్స్.. వీడియో వైరల్

Twitter IconWatsapp IconFacebook Icon
ఊ అంటావా! ఊఊ అంటావా!.. పాటకి ప్రగతి ఊరమాస్ స్టెప్స్.. వీడియో వైరల్

‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’.. ఎక్కడ విన్నా ఇప్పుడీ పాటే. ‘పుష్ప’ సినిమా విడుదలైనప్పటి నుండి ఈ పాట సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. పాట లిరిక్సే కాకుండా సమంత-అల్లు అర్జున్‌ల ఊరమాస్ స్టెప్స్ ఈ పాటని ఇప్పటికీ ట్రెండింగ్‌లో నిలుపుతున్నాయి. ఆడా, ఈడా అనే తేడా లేకుండా.. విడుదలైన అన్ని చోట్లా ఇప్పుడీ పాట ఊ అంటూ ఊపేస్తుంది. సౌత్, నార్త్‌లోని ఎందరో నటీమణులు ఈ పాటకి డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వారి దారిలోనే నా ఊపేంటో కూడా చూడండి అన్నట్లుగా నటి ప్రగతి కూడా తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ఈ పాటకి ఊరమాస్ స్టెప్స్ వేస్తూ.. ‘ఊఊ’ అనలేని విధంగా ఓ ఊపు ఊపేసింది.


డ్యాన్స్ చేస్తున్న వీడియోనే కాకుండా.. ‘‘నేను నా పరిస్థితులకు ప్రభావితమయ్యే వ్యక్తిని కాను.. నా నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకునే వ్యక్తిని’’ అని ఆమె ఇచ్చిన కొటేషన్‌కి కూడా బీభత్సంగా లైక్స్ పడుతున్నాయి. ఈ పోస్ట్‌కి నెటిజన్లు కూడా చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి ప్రగతి డ్యాన్స్ చేసినా, కసరత్తులు చేసినా.. చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అందుకే నెటిజన్లు కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే తనని ఎంకరేజ్ చేయాలనో.. లేదంటే తనని మెచ్చుకోవాలనో.. ప్రగతి ఇటువంటి వీడియోలు పెట్టదు. ఈ విషయం ఆమె అనేక సందర్భాల్లో చెప్పింది.. పైన కొటేషన్ అర్థం కూడా అదే. వయసుతో సంబంధం లేకుండా.. ధైర్యంగా తను చేయాలనుకున్నవన్నీ ఆమె చేసేస్తోంది. అందుకే ఆమెకు అభిమానగణం కూడా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.