పెళ్లికి విక్కీ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్న Katrina Kaif.. ఎంతో తెలుసా..

ABN , First Publish Date - 2021-12-09T22:11:38+05:30 IST

అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ డిసెంబర్ 9న పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే...

పెళ్లికి విక్కీ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్న Katrina Kaif.. ఎంతో తెలుసా..

అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ డిసెంబర్ 9న పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వీరి వివాహం అయినట్లు సమాచారం. అయితే ఇంతకుముందు ఈ లవ్ కపుల్ మ్యారేజ్ గురించి రోజుకో వార్త బయటికి వచ్చింది.


ఈ కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు ఎంతో సిక్రెట్ పెళ్లి చేసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. అనంతరం మ్యారేజ్ ఫోటోలు, వీడియోలను మంచి ధరకి వెబ్‌సైట్‌లకి అమ్ముకుంటున్నారు. గతంలో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఇలాగే చేయగా.. విక్యాట్ సైతం దాదాపు 100 కోట్లకి పుటేజీని స్ర్రీమింగ్ కోసం అమ్ముకున్నట్లు వార్తలు వచ్చాయి.


అయితే కొత్త సమాచారం ప్రకారం, సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ యాజమాన్యం ప్రమోషన్ కోసం ఉచితంగానే తమ హోటల్‌ని కేటాయించిందటా. ట్రావెలింగ్, సెక్యూరిటీ తదిరత విషయాలలో డెసిషన్ కత్రినానే తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి విషయాల్లో విక్కీ చాలా తక్కువగా ఇన్‌వాల్వ్ అయినట్లు తెలుస్తోంది.


అంతేకాకుండా, పెళ్లికి అయ్యే ఖర్చులో దాదాపు 75 శాతం వరకు కత్రినానే భరిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 25 శాతాన్ని మాత్రమే విక్కీ ఖర్చు చేస్తున్నాడట. అంతేకాకుండా ఫుటేజీ అమ్మకం, సెల్ ఫోన్స్ నిషేధించడం ఇలాంటి అన్ని రూల్స్ ఈ బ్యూటీయే తీసుకుంది. కాగా, పెళ్లి కవరేజీ కోసం మీడియాకి పర్మిషన్ లేకపోవడంపై ఈ యంగ్ హీరో సంతోషంగా లేడని సమాచారం.



Updated Date - 2021-12-09T22:11:38+05:30 IST