పెళ్లి చేసుకుంటానన్న బాలీవుడ్ స్టార్ హీరో మేనల్లుడు.. నటి Juhi Chawla రియాక్షన్ ఏంటంటే..

జుహీ చావ్లా.. ఈ నటి 90ల దశకంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. ఆ సమయంలో ఎంతోమందికి ఈ సీనియర్ నటి అంటే పిచ్చి క్రేజ్ ఉండేది. అందులో ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఒకరు.


జుహీ చావ్లా, ఆమీర్ జంటగా 1988లో ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ అనే సినిమా చేశారు. ఆ సమయంలో ఇమ్రాన్ వయస్సు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. కానీ అప్పుడే ఈ తారని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడంటా ఈ స్టార్ మేనల్లుడు. ఆ విషయాన్నే ఆమెకి సైతం చెప్పాడంటా. ఈ విషయాన్ని స్వయంగా ఇమ్రానే తన సినిమా ‘ఐ హేట్ లవ్‌స్టోరీస్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వూలో చెప్పాడు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఆంటీ జీ అనే పాటలో ‘ఏక్ మైన్ ఔర్ ఎక్క్ తూ’ అంటూ జూహీ చావ్లాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు ఈ నటుడు.




ఓ ఇంటర్వూలో ఈ విషయం గురించి 54 ఏళ్ల జుహీ చావ్లా మాట్లాడుతూ.. ‘ఇమ్రాన్ నాకు ఆరు సంవత్సరాల వయసు నుంచి తెలుసు. మంచి పిల్లాడు. నాకు ఎంతో ఇష్టం. షూటింగ్‌ సెట్స్ వచ్చినప్పుడు ఆమీర్‌ని మాము అని, నన్ను ఆంటీజీ అని పిలిచేవాడు. ఒకసారి పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. అయితే అతనికి నేను ఎప్పుడూ ఆంటీ జీనే అని చెప్పాన’ని తెలిపింది. అనంతరం ఈ సీనియర్ నటి బిజినెస్ మేన్ జే మెహతాను వివాహం చేసుకోగా వారికి ఇద్దరూ పిల్లలు.


అయితే 2015లో వచ్చిన ‘కట్టి బట్టి’ తర్వాత ఇమ్రాన్ సినిమాలకు స్వస్తి చెప్పాడు. ఈ విషయాన్ని ఆయన మామ రంజీవ్ మాలిక్ తెలియజేశాడు. ఆ నటుడికి మొదటి నుంచి డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని, దాని మీదే కసరత్తు చేస్తున్నట్లు రంజీవ్ చెప్పాడు.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.