‘‘ఆ టీచర్ నాతో తప్పుగా ప్రవర్తించాడు... కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ...’’

హిందీ బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ఉన్న అందాల రాశి దేవోలీనా భట్టాచార్య. ‘సాథ్ నిభానా సాథీయా’ సీరియల్‌తో ఆమె సంవత్సరాల తరబడి టెలివిజన్ ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసింది. తరువాత బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్న గ్లామరస్ యాక్ట్రస్ తాజాగా తన చిన్న నాటి చేతు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంది. 


దేవోలీనా భట్టాచార్య చిన్నతనంలో... ఓ మ్యాథ్స్ టీచర్ ఆమెకు ట్యూషన్ చెప్పేవాడట. అతను ఓ సారి తనతో తప్పుగా ప్రవర్తించాడు. ఆ లైంగిక చేష్టల్ని వెంటనే దేవోలీనా తల్లికి వివరించింది. అయితే, దేవోలీనా తల్లి సదరు టీచర్ మాస్టర్ ఇంటికి వెళ్లి అతడి భార్యకి కంప్లైంట్ చేసిందట. అంతే తప్ప, తన కుటుంబ సభ్యులెవరూ... పోలీస్ స్టేషన్‌కి వెళ్లలేదని దేవోలీనా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కానీ, అప్పట్లో ఆమెకి అతడిపై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని మనసులో అనిపించిందట. చిన్న పిల్లలతో అలా తప్పుగా ప్రవర్తించే వార్ని, లైంగిక నేరస్థుల్ని ఎంత మాత్రం చూసీచూడనట్టు వదలద్దు అంటోంది దేవోలీనా భట్టాచార్య.   

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.