బాలీవుడ్ బ్యూటీకి bail : దళితుల్ని అవమానించిన కేసులో నటి అరెస్ట్...

బాలీవుడ్ నటి యువికా చౌదరి ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయింది. హర్యానాలోని హన్సీ పోలీసుల ఆమెని మూడు గంటల పాటూ ప్రశ్నించారు. తరువాత, ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి, బెయిల్ మంజూరు చేశారు. దాంతో పోలీస్ స్టేషన్‌కి పది మంది బౌన్సర్స్‌, భర్తతో కలసి వచ్చిన యువికా ఇంటికి వెనుదిరిగింది. 


యువికా చౌదరి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. అయితే, గత మే 25న ఆమె ఓ వీడియో షూట్ చేస్తూ దళితుల విషయంలో నోరు జారింది. తన ‘లుక్’ గురించి మాట్లాడుతూ హర్యానా ప్రాంతంలోని ఓ దళిత కులాన్ని కించపరిచేలా యువికా స్థానిక పలుకుబడుల్ని ఉపయోగించింది. దాంతో ఆమెపై ఓ దళిత హక్కుల ఉద్యమకారుడు, న్యాయవాది రజత్ అట్రాసిటీ కేసు నమోదు చేశాడు. అప్పట్నుంచీ వివిధ కోర్టుల్ని ఆశ్రయించిన సినీ నటి ముందస్తు బెయిల్ పొందలేకపోయింది. అలాగే, హర్యానా హై కోర్ట్ కేసుపై స్టే విధించే అంశాన్ని కూడా తోసిపుచ్చింది. కేసు విచారణలో పోలీసులకి సహకరించాలని సూచించింది. యువికా చౌదరి న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసుల ముందు స్వచ్ఛందంగా లొంగిపోయింది. కొన్ని గంటల తరువాత బెయిల్ లభించటంతో విడుదలై ఇంటికి వెనుదిరిగింది. 


దళితుల్ని అవమానించటం తన ఉద్దేశం కాదని, తాను వాడిన పదాలకి అర్థం పూర్తిగా తనకు తెలియదని యువికా గతంలోనే చెప్పింది. బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పింది. అయినా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావటంతో ఆమె లొంగిపోక తప్పలేదు. ఒకవేళ అట్రాసిటీ కేసులో ఆమెకు శిక్ష పడితే గరిష్ఠంగా అయిదేళ్లు జైలు జీవితం గడపాల్సి రావచ్చని ప్రచారం జరుగుతోంది. యువికా బాలీవుడ్‌లోనే కాక బుల్లితెరపై కూడా అనేక సీరియల్స్‌లో, రియాల్టీ షోస్‌లో కనిపిస్తూ ఇప్పటికే చాలా పేరు తెచ్చుకుంది.  

ఇవి కూడా చదవండిImage Caption

బుర్జ్ ఖలీఫాపై గోల్డ్ ప్లేటెడ్ కాఫీతో సందడి చేసిన నటి సనా ఖాన్దళిత, హిందూ డిప్యూటీ సీఎంలు: హర్‌‌సిమ్రత్ కౌర్54 మంది విద్యార్థులకు కరోనాటీడీపీ నేతలపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.