కరోనా బారిన పడ్డ శ్రీకాంత్

ABN , First Publish Date - 2022-01-26T19:53:20+05:30 IST

టాలీవుడ్‌లో శతాధిక చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో శ్రీకాంత్. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్‌గానూ, విలన్ గానూ సత్తాచాటుకుంటున్నారు. ఇటీవలే ఓ సీనియర్ హీరో సినిమాలో విలన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీకాంత్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఈ రోజు (బుధవారం) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘మిత్రులారా.. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. నాకు కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి.

కరోనా బారిన పడ్డ శ్రీకాంత్

టాలీవుడ్‌లో శతాధిక చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో శ్రీకాంత్. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్‌గానూ, విలన్ గానూ సత్తాచాటుకుంటున్నారు. ఇటీవలే ఓ సీనియర్ హీరో సినిమాలో విలన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటే.. శ్రీకాంత్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఈ రోజు (బుధవారం) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘మిత్రులారా.. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. నాకు కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. నాతో కాంటాక్ట్ లో ఉన్నవారికి ఎవరికైనా ఆ లక్షణాలున్నట్టైతే.. వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోండి’ అని ట్విట్టర్ వేదికగా అభ్యర్ధించారు శ్రీకాంత్. 



Updated Date - 2022-01-26T19:53:20+05:30 IST