వివాదస్పదంగా మారిన Layer’r shot యాడ్‌కు నో చెప్పిన నటుడు

ABN , First Publish Date - 2022-06-22T21:41:03+05:30 IST

లైంగిక హింసను ప్రోత్సహించేలా పర్‌ఫ్యూమ్ బ్రాండ్ ‘షాట్’ (SHOT) వివాదస్పద యాడ్‌‌(ad)ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ విడుదలైన కాసేటికే పెను దుమారం రేగింది. కాంట్రవర్సీకి

వివాదస్పదంగా మారిన Layer’r shot యాడ్‌కు నో చెప్పిన నటుడు

లైంగిక హింసను ప్రోత్సహించేలా పర్‌ఫ్యూమ్ బ్రాండ్ ‘షాట్’ (SHOT) వివాదస్పద యాడ్‌‌(ad)ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ విడుదలైన కాసేటికే పెను దుమారం రేగింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఫలితంగా సమాచార, మంత్రిత్వ శాఖ ఈ యాడ్‌ను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ లేయర్ షాట్ యాడ్ కోసం ఓ నటుడిని సంప్రదించగా ఆయన అంగీకరించలేదని  తెలిసింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. 


లేయర్ షాట్ యాడ్ కోసం నటుడైన సౌరభ్ వర్మ(Saurabh Verma)ను కాస్టింగ్ ఏజెంట్ సంప్రదించారు. కానీ, సౌరభ్ స్క్రిఫ్ట్‌ను మార్చాలని యాడ్ ఏజెన్సీని కోరారు. అందుకు ఏజెన్సీ అంగీకరించలేదు. ఫలితంగా ఆయన యాడ్‌ను చేయలేదని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కినెక్ట్స్’ సీనియర్ క్రియేటర్ డైరెక్టర్ అబ్బాస్ మిర్జా(Abbas Mirza) తెలిపారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నా స్నేహితుడు, నటుడు సౌరభ్ వర్మ లేయర్ షాట్ యాడ్‌కు నో చెప్పారు. స్ర్కిఫ్ట్‌ను చదవగానే కొన్ని మార్పులు చేయమని ఆయన అడిగారు. అందుకు యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు అంగీకరించలేదు. ఫలితంగా ఆయన యాడ్‌ను చేయలేకపోయారు. సౌరభ్ పర్మిషన్ తీసుకుని అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను మీతో షేర్ చేస్తున్నాను. నేను నా మిత్రుడిని చూసి గర్విస్తున్నాను. ఆయన టాలెంటెడ్ నటుడు. బిగ్ బ్రాండ్స్‌కు అనేక యాడ్‌లు చేశారు’’ అని అబ్బాస్  సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Updated Date - 2022-06-22T21:41:03+05:30 IST