సూపర్ స్టార్ సూపర్ గిఫ్ట్ : అభిమానికి బహుమతిగా కోట్లు ఖరీదు చేసే వాహనం!
ABN , First Publish Date - 2021-11-25T21:03:54+05:30 IST
ఆ సూపర్ స్టార్ ఓ అభిమానికి తన స్వంత వాహనాన్ని బహుమతిగా ఇచ్చేశాడు! కోట్లు ఖరీరు చేసే తన కస్టమైజ్డ్ ట్రక్కుని ఒక స్పెషల్ ఫ్యాన్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు!
‘ద రాక్’గా ప్రసిద్ధి చెందిన రెజ్లర్, హాలీవుడ్ సూపర్ స్టార్... డ్వైన్ జాన్సన్... ఓ అభిమానికి తన స్వంత వాహనాన్ని బహుమతిగా ఇచ్చేశాడు! కోట్లు ఖరీరు చేసే తన కస్టమైజ్డ్ ట్రక్కుని ఆస్కార్ అనే స్పెషల్ ఫ్యాన్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు!
డ్వైన్ జాన్సన్ నటించిన తాజా చిత్రం ‘రెడ్ నోటీస్’. ఇప్పటికే థియేటర్స్‌లో విడుదలై మంచి సక్సెస్ టాక్ సంపాదించుకుంది. అయితే, రీసెంట్‌గా హాలీవుడ్ సూపర్ స్టార్ తన అభిమానులు కొందర్నీ ప్రత్యేక స్క్రీనింగ్‌కి ఆహ్వానించాడు. వారందరికీ ఫ్రీగా తన యాక్షన్ ఎంటర్టైనర్‌ని చూపించాడు. అయితే, ఒక్క ఫ్యాన్‌కి మాత్రం బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. అతనే ఆస్కార్...
తన డై హార్డ్ ఫ్యాన్ అయిన ఆస్కార్ గురించి డ్వైన్ జాన్సన్ వీలైనంత తెలుసుకున్నాడట. అతడి లాగే ఇంకా మరికొందరి గురించి కూడా సమాచారం సేకరించాడు. కానీ, అందరిలోనూ ఆస్కార్ కథ హాలీవుడ్ సూపర్ స్టార్ మనసును కదిలించింది. ఎందుకంటే, అతనో నేవీ వెటరన్, ప్రస్తుతం జిమ్‌లో పర్సనల్ ట్రైనర్. 75 ఏళ్ల తల్లిని ఒక్కడే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. లోకల్ చర్చీలో లీడర్‌గా వ్యవహరిస్తూ అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. స్థానికంగా కొందరు ఇబ్బందుల్లో ఉన్న ఆడవారికి వీలైన సాయం చేస్తుంటాడు. తిండిలేని వారికి తనకు చేతనైనంతలో ప్రతీ రోజూ మీల్స్ ఏర్పాటు చేస్తాడు. ఇవన్నే కాక ఆస్కార్ చిన్నప్పుడు డొమెస్టిక్ వయొలెన్స్‌కి గురయ్యాడు. అయినా తన గతాన్ని పక్కన పెట్టి పది మందికీ సాయం చేస్తున్నాడు!
ఆస్కార్ గొప్ప మనస్సు తెలుసుకున్న డ్వైన్ జాన్సన్ నేరుగా ‘రెడ్ నోటీస్’ సినిమా స్పెషల్ షో నడుస్తోన్న థియేటర్‌కి వెళ్లాడు. అతడ్ని వేదిక మీదకు ఆహ్వానించాడు. అతడి నేపథ్యం, గొప్ప మనస్సు అందరికీ వివరించాడు. తరువాత ‘నీకో సర్‌ప్రైజ్’ అంటూ ఆస్కార్‌ని సినిమా హాలు బయటకు తీసుకుపోయి తన ట్రాక్ వద్ద నిలుచోబెట్టాడు. అందులో ఉన్న లెటర్‌లో ‘‘ఈ ట్రక్ నీదే... ఎంజాయ్!’’ అన్న వాఖ్యం చూసి... సదరు డ్వైన్ జాన్సన్ అభిమాని భావోద్వేగంతో... కంటతడి పెట్టుకున్నాడు! ఈ వ్యవహారం మొత్తం వీడియో రికార్డింగ్ చేయగా... దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు ‘ద రాక్’! ఇటు హీరోగారి పెద్ద మనస్సు... అటు అభిమాని గొప్ప వ్యక్తిత్వం... రెండూ చూసి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు!
