నటుడు Arjunపై లైగింక వేధింపుల కేసు.. మూడు సంవత్సరాల విచారణ తర్వాత చివరికి..

ABN , First Publish Date - 2021-12-01T21:26:47+05:30 IST

గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ‘మీ టూ’ కారక్రమం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినీ పరిశ్రమలోని ఎంతోమంది నటీమణులు ఇండస్ర్టీలో తాము ఎదుర్కొన్న లైగింక వెధింపుల గురించి వెల్లడించారు.

నటుడు Arjunపై లైగింక వేధింపుల కేసు.. మూడు సంవత్సరాల విచారణ తర్వాత చివరికి..

గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ‘మీ టూ’ కారక్రమం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినీ పరిశ్రమలోని ఎంతోమంది నటీమణులు ఇండస్ర్టీలో తాము ఎదుర్కొన్న లైగింక వెధింపుల గురించి వెల్లడించారు. ఇందులో కొన్ని నిజమైనప్పటికీ కొన్ని కాకపోవచ్చు. ‘మీ టూ’ అంటూ ప్రముఖ నటుడు అర్జున్ సర్జాపై ఆరోపణలు చేసింది కన్నడ నటి శృతి హరిహరన్. దీనిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


అర్జున్ గురించి ఆరోపిస్తూ శృతి చేసిన పోస్టులో.. ‘మేమిద్దరం కలిసి ‘విస్మయ’ అనే సినిమా చేశాం. అందులో భాగంగా ఓ సిన్ రిహార్సల్ చేస్తున్నప్పుడు ఆయన ఇబ్బందికరంగా తడిమాడని, అనంతరం గట్టిగా కౌగిలించుకున్నట్లు’ చెప్పుకొచ్చింది.


అయితే, మూడేళ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో చివరికి అర్జున్‌కి రిలీఫ్ దొరికింది. ఆయనపై ఉన్న అన్ని ఛార్జ్ సీట్లను ఎత్తివేస్తూ క్లీన్ చీట్ ఇచ్చారు బెంగళూరు పోలీసులు. శృతి ఆరోపణలకు అనుకూలంగా ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లభించకపోవడంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వీటిని కొట్టి వేసింది.

Updated Date - 2021-12-01T21:26:47+05:30 IST