యాక్షన్ గణా
ABN , First Publish Date - 2022-09-27T06:11:00+05:30 IST
‘దుర్మార్గుడు’ ఫేమ్ విజయ్‌కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘గణా’. సుకన్య, తేజు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్...

‘దుర్మార్గుడు’ ఫేమ్ విజయ్‌కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘గణా’. సుకన్య, తేజు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘నేనుు పుట్టి పెరిగింది తూర్పు గోదావరి జిల్లా. ఇప్పుడు అక్కడి నుంచే మరో కృష్ణారెడ్డి కూడా పరిశ్రమకు వచ్చారు. కాకపోతే అతని పూర్తి పేరు విజయకృష్ణారెడ్డి. తనే హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తూ ‘గణా’ చిత్రాన్ని నిర్మించారు. అన్నీ తనే చేస్తూ సినిమా తీయడం అంటే మాములు విషయం కాదు. ఆయన ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’అన్నారు. ‘ప్రతి వ్యక్తికీ ఓ ఆదర్శం ఉంటుంది. నాకు ఎస్వీ కృష్ణారెడ్డిగారు ఆదర్శం. నేను ఇంతవరకూ ‘దుర్మార్గుడు’, ‘గోవిందా భజ గోవిందా’ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించాను, నేను హీరోగా నటించిన మూడో చిత్రం ‘గణా’. తొలిసారిగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రనిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అన్నారు.